ఎల్ఐసీ బెస్ట్ ప్లాన్.. రూ.200 లతో రూ.28 లక్షలు బెనిఫిట్..

Satvika
డబ్బులు పొదుపు చెయ్యాలని అనుకుంటారు... పొదుపు కోసం బెస్ట్ పథకాలను అందిస్తుంది ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ.. ఎల్‌ఐసీలో పెట్టుబడి పెట్టిన డబ్బు సురక్షితంగా ఉంటుంది. అయితే ఎల్‌ఐసీలోని ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. ఎల్‌ఐసీ సమాజంలోని ప్రతి వర్గాల ప్రజల కోసం బీమా పథకాన్ని తీసుకువస్తుంది.. మీరు కూడా పెట్టుబడి గురించి ఆలోచిస్తున్నారా అయితే మీరు ఇందులో పెట్టడం చాలా మంచిది..

ఎల్‌ఐసీకి లోని జీవన్ ప్రగతి ప్లాన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే దానిలో మీకు జీవితకాల రక్షణ లభిస్తుంది. రోజుకు 200 రూపాయలు, నెలలో 6 వేల రూపాయలు డిపాజిట్ చేయండి. అంటే ఏటా 72 వేల రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. ఈ పథకం లో 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీరు బోనస్‌తో పాటు రూ. 28 లక్షలు పొందుతారు. ఈ బీమా ప్లాన్‌లో రిస్క్ కవర్ ప్రతి 5 సంవత్సరాలకు పెరుగుతుంది. ప్రతి 5 సంవత్సరాలకు హామీ మొత్తం పెరుగుతుంది..ఏదైనా కారణంగా పాలసీదారుడు మరణిస్తే అతనికి నామినీకి మొత్తం డబ్బులు వస్తాయి..

ఈ స్కీమ్ లో రూ. 4 లక్షల పథాకాన్ని కొనుగోలు చెయ్యొచ్చు..5 సంవత్సరాల తర్వాత అది రూ.5 లక్షలు అవుతుంది. దీని తర్వాత 10 నుంచి 15 ఏళ్ల కు రూ.6 లక్షలు, 20 ఏళ్లలో ఈ మొత్తం రూ.7 లక్షలు అవుతుంది. ఎల్‌ఐసీ జీవన్ ప్రగతి బీమా యోజన కింద మీరు కనీసం 12, 20 సంవత్సరాల కాలపరిమితిని పొందుతారు.12 నుంచి 45 ఏళ్ల లోపు వారు ఈ బీమా పథకాన్ని తీసుకోవచ్చు. ఈ పథకం కింద ప్రీమియం మొత్తాన్ని త్రైమాసిక, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన డిపాజిట్ చేయవచ్చు. కనిష్ట హామీ మొత్తం 1.5 లక్షలు..గరిష్టం పై పరిమితి లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: