వారానికి ఒక్కరోజే ఆఫీసుకి.. స్టార్టప్ కంపెనీ బంపర్ ఆఫర్?

praveen
ఒకప్పుడు ఉండే ఉద్యోగాలకి నేటి రోజుల్లో యువత చేస్తున్న ఉద్యోగాలకి చాలా తేడా ఉంది అని చెప్పాలి . ఒకప్పుడు వారాంతం మొత్తం పనిచేయడానికి ఎక్కువగా ఇష్టపడేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం ఏకంగా వారంలో రెండు రోజుల పాటు లీవ్ తీసుకుని ఐదు రోజులు మాత్రమే పనిచేస్తున్నారు. అయినప్పటికీ ఇంకొక రోజు సెలవు దొరికితే బాగుండు అని ఎంతో మంది ఉద్యోగులు కోరుతూ ఉన్నారు అని చెప్పాలి. అదే సమయంలో ఇక కరోనా వైరస్ కారణంగా ఇప్పటికీ కూడా ఎంతోమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ప్రస్తుతం కొంతమంది ఇక కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో మళ్ళీ ఆఫీసులకు వెళ్లి ఎప్పటిలాగానే స్నేహితులతో కలిసి వర్క్ లో మునిగిపోతూ ఉన్నారు. అయితే ఇక ఇటీవల కాలంలో కొన్ని కంపెనీలు అయితే తమ ఉద్యోగుల కోసం వినూత్నమైన ఆఫర్లను ప్రకటిస్తూ ఇక అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి అని చెప్పాలి. సాధారణంగా ప్రతిరోజు ఆఫీసుకు వచ్చి ఎంతో శ్రద్ధగా పనిచేసే ఉద్యోగులు దొరకాలని అన్ని కంపెనీల యాజమాన్యాలు భావిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక కంపెనీ మాత్రం ఉద్యోగులు ఆఫీస్ కి రావాల్సిన అవసరం లేదు ఒకవేళ వచ్చినా వారానికి ఒక్కరోజు వస్తే సరిపోతుంది అనే ఆఫర్ను ప్రకటించాయ్. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఆన్లైన్ రిటైల్ స్టార్టప్ కంపెనీ అయిన మీ షో ఇలా వెరైటీ ఆఫర్ను ప్రకటించింది. వారంలో ఒక్కరోజు మాత్రమే ఆఫీసుకు రండి అంటూ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వచ్చే ఏడాది జూన్ నుంచి వారంలో ఒక్కరోజే ఆఫీసుకు రావాలని మిగతా రోజులు మొత్తం ఇక ఇంటి దగ్గర నుంచి పని చేసేందుకు వెసులుబాటు ఉంది అంటూ తెలిపింది. అయితే సదరు కంపెనీలో పనిచేసే మెజారిటీ ఉద్యోగాల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాతే ఇక ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు మీ షో ప్రకటించింది అని చెప్పాలి. ఇది కాస్త ప్రస్తుతం హాట్ హార్ట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Job

సంబంధిత వార్తలు: