
"పవన్ కళ్యాణ్" ఒక్కడి ఇమేజ్ వల్ల ఒరిగేదేమీ లేదు ?
ఎంతసేపూ ఒక్క పవన్ కళ్యాణ్ ఫోటోను చూపించి ఆయనకున్న ఇమేజ్ తో రాజకీయంగా ఇంత పోటీని తట్టుకుని గెలవడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. రాజకీయంగా గెలవాలంటే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజల నుండి తగిన మద్దతు ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది. పవన్ కూడా కొన్ని విషయాలలో తప్పటడుగులు వేస్తున్నాడని చెప్పాలి.. రాబోయే ఎన్నికలకు కనీసం వైసీపీకి పోటీ ఇవ్వాలన్నా కూడా ప్రజలు మెచ్చిన మరియు ప్రజల నుండి వచ్చిన నాయకులను ఎమ్మెల్యే మరియు ఎంపీ కాండిడేట్ లుగా ఎన్నుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
అయితే పవన్ కూడా ఒక పార్టీని ముందుకు తీసుకెళ్లే నాయకుడిలా కాకుండా ఇంకా సినిమాటిక్ ఆలోచనలతోనే ఉన్నాడని తన పనితీరు చూస్తే అర్ధమవుతోంది. ఇక ముందు అయినా ఉన్న కాస్త సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలోచన తీరును మార్చుకుని, ప్రజలలో ఎక్కువగా మెలుగుతున్న నాయకులను ఎన్నికలో పోటీదారులుగా ఎంచుకుంటే మంచిదని పవన్ అభిమానులు మరియు మద్దతుదారుల అభిప్రాయం. ఇక జనసేన ఎన్నికలో ఒంటరిగా పోటీ చేస్తుందా లేదా ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది.