డబ్బు అవసరం ఎప్పుడు ఎక్కడ నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు..కొన్ని పరిస్థితులలో డబ్బుల విషయంలో ఏదొక తప్పు చేస్తారు..అలాంటి తప్పులు చేస్తున్న వారికి ఇదో గుడ్ న్యూస్ అనే చెప్పాలి..అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. వెంటనే లోన్ పొందొచ్చు.అది కూడా ఎక్కడికీ వెళ్లకుండానే. స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. వాట్సాప్ ద్వారానే లోన్ పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా.. అయితే మనం వాట్సాప్ ద్వారా లోన్ ఎలా పొందొచ్చొ ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ క్యాషేతో వాట్సాప్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా యూజర్లు క్షణాల్లో ఇన్‌స్టంట్ లోన్స్ పొందొచ్చు. క్యాషే సులభంగానే కేవైసీ పూర్తి చేస్తుంది. అలాగే జియో హ్యాప్టిక్ ద్వారా ఈజీగానే పని పూర్తవుతుంది. వెరిఫై పూర్తి చేసుకున్న కస్టమర్లు సులభంగానే డబ్బులు పొందొచ్చు. క్రెడిట్ ఫెసిలిటీని వాడుకోవచ్చు..జస్ట్ మీరు పాన్ కార్డ్ మీద ఉన్న పేరును తెలిపితే మాత్రం చాలు క్యాషె పూర్తి వివరాలను సేకరిస్తుంది.
కేవైసీ వెరిఫికేషన్ కంప్లీట్ చేసేస్తుంది. అర్హత కలిగిన కస్టమర్లకు క్షణాల్లో రుణం లభిస్తుంది. లేదంటే లేదు. వాట్సాప్ ద్వారా లోన్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం వాట్సాప్ వాడే వారు ఒక నెంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. 8097553191 అనే నెంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోండి..నెంబర్‌కు మీరు వాట్సాప్ ద్వారా హాయ్ అనే మెసేజ్ పంపాలి. మీరు హాయ్ అని పంపిన తర్వాత మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. గెట్ ఇన్‌స్టంట్ క్రెడిట్ లైన్, ఆప్షన్స్ అనేవి ఇవి.
ఇందులో మీరు గెట్ ఇన్‌స్టంట్ క్రెడిట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీరు మీ పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఏఐ బాట్ మీ వివరాలను వెరిఫై చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మీకు ప్రిఅప్రూవ్డ్ క్రెడిట్ లైన్ వస్తుంది. రూ. 5 వేల వరకు డబ్బులు పొందొచ్చు. అది కూడా క్షణాల్లోనే. అయితే మీకు రూ. 5 వేల కన్నా ఎక్కువ డబ్బులు కావాలంటే నేరుగా క్యాషే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రూ. 4 లక్షల వరకు లోన్ పొందొచ్చు..కేవలం ఉద్యోగులకు మాత్రమే ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. మీకు కూడా లోన్ కావాలంటే క్యాషే ద్వారా అప్లై చేసుకోవచ్చు..