పొదుపు పథకాలలో ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటున్నారా? వీటిని చూడండి..

Satvika
పొదుపు చెయ్యాలని అనుకోనేవారికి చాలా మంచి పథకాలు అందుబాటులోఉన్నాయి..అందులో కొన్ని మాత్రమే బెస్ట్ గా ఉన్నాయి వాటి గురించి వివరంగా తెలుసుకుందాం...తక్కువ కాలంలో తమ డబ్బు విలువ పెరిగే పథకాలపై సామాన్య ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో కొంతమంది తమ డబ్బులు పరిమితి కాలంలో రెట్టింపు అవుతాయనే దురాశతో.. కొన్ని నకిలీ పథకాల్లో పెట్టుబడులు పెట్టి తమ డబ్బులు నష్టపోయిన ఘటనలు ఎన్నో చూశాం. అందుకే పొదుపు చేసే ముందు ఏ పథకంలో చేస్తున్నాం. ఆ పథకంలో మన డబ్బులు సురక్షితమో కాదో పూర్తి వివరాలు చూడాలి..

ఫిక్స్‌డ్ డిపాజిట్. చాలా ప్రాచుర్యం పొందిన పొదుపు పథకాల్లో ఇదొకటి. బ్యాంకు ఇచ్చే వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, ఆ వడ్డీ మీద కూడా టాక్స్ కట్టాల్సి రావడం, ఏదైనా అవసరం వచ్చి నిర్ణీత సమయం కంటే ముందే డబ్బు తీసుకోవాలంటే పెనాల్టీ కట్టాలనే నియమం ఉండటం వల్ల ప్రస్తుతం ఫిక్సడ్ డిపాజిట్ పథకంపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.కానీ నిర్ణీత సమయానికి ఫలానా మొత్తం కచ్చితంగా కావాలంటే ఫిక్సడ్ డిపాజిట్ ఒక మంచి మార్గమే అవుతుంది.

ప్రావిడెంట్ ఫండ్ వ్యక్తి యొక్క దీర్ఘకాలిక అవసరాలకు బాగా ఉపయోగపడుతుంది. ఉద్యోగి తరఫున జమ అయ్యే ప్రావిడెంట్ ఫండ్ (ఈపీయఫ్) వార్షిక మొత్తం రెండున్నర లక్షలు దాటితే దాని మీద టాక్స్ కట్టాలనే నియమం కొత్తగా వచ్చింది. ఈ నియమాన్ని పరిగణలోకి తీసుకున్నా, ప్రావిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగికి చాలా మంచి అవకాశం. డబ్బులు ఉద్యోగి చేతిలోకి రాకుండా నేరుగా జమ కావడం వల్ల ప్రత్యేకంగా పొదుపు చేయాల్సిన అవసరం లేకుండా తన పిఎఫ్ ఖాతాలోకి జమ అవుతుంది. ఇలా జమ అయ్యే భవిష్యత్ నిధి కొన్ని ప్రత్యేక అవసరాలకు మాత్రమే వాడుకోవచ్చు. ప్రస్తుతం ప్రాఫిడెంట్ ఫండ్‌పై వడ్డీ 8శాతానికి పైగా వస్తుంది.
స్టాక్ మార్కెట్ తో పాటు రియల్ ఎస్టేట్ లో కూడా డబ్బులను పెట్టడం మంచిదే..పొదుపు చెయ్యాలని అనుకుంటే మాత్రం వీటిని ఒకసారి చూడండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: