యూపీఐ ద్వారా వేరే అకౌంట్ కు డబ్బులు పంపించారా?
ఈ క్రమంలోనే ఒకవేళ మీరు ఆన్‌లైన్ లావాదేవీ కోసం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) ఉపయోగించినట్లయితే, మీ డబ్బు తప్పుడు ఖాతాకు వెళితే, ఇకపై మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సులభమైన మార్గం ద్వారా మీ డబ్బు వాపసు పొందవచ్చు. మరి అదెలాగో ఇక్కడ తెలుసుకోండి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ తో ఈ రోజుల్లో ఆర్ధిక లావాదేవీలు బాగా జోరుగా సాగుతున్నాయి. సెకన్ల వ్యవధిలోనే మీరు ఎవరికైనా డబ్బును పంపొచ్చు. దీని కోసం మీరు బ్యాంకుకు కూడా వెళ్లవలసిన అవసరం లేదు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం, ఒకవేళ తప్పుడు ఖాతాకు డబ్బును బదిలీ చేసినట్లయితే, మీరు వెంటనే RBI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి.. ఫిర్యాదు నమోదు చేసుకోవాలి. దీంతో పాటు బ్యాంకు శాఖకు కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.వారు దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు.మొదటిగా ఈ bankingombudsman.rbi.org.in లింక్‌ను సందర్శించండి. ఆ తర్వాత మీ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా రీఫండ్ కోసం మీరు బ్యాంకుకు దరఖాస్తును సమర్పించాలి. దీనితో పాటు, మీరు మీ బ్యాంక్ ఖాతా, మీరు పొరపాటున డబ్బు పంపిన ఖాతాకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా తెలియజేయాలి.అక్కడ కంప్లైంట్ చెయ్యాల్సి ఉంటుంది..