కేసిఆర్ చెప్పింది వినండయ్యా.. ఆ చెట్టును నరికేయండి?

praveen
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన  గొప్ప కార్యక్రమాలలో అటు హరితహారం అనే కార్యక్రమం కూడా ఒకటి. తెలంగాణ మొత్తాన్ని పచ్చటి తోరణంలా మార్చాలి అనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేవలం ఈ కార్యక్రమం గురించి మాటలు చెప్పి ఊరుకోకుండా చేతల్లో కూడా చేసి చూపించారు. ఇక తెలంగాణ ప్రజానీకాన్ని మొత్తం హరితహారం కార్యక్రమంలో భాగం చేసి పచ్చటి చెట్లే ప్రగతికి మెట్లు అన్న పదాన్ని నిజం చేసి చూపించారు కేసీఆర్. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లిన రోడ్డుకు ఇరువైపులా పచ్చటి చెట్లు దర్శనమిస్తున్నాయి అంటే అది కెసిఆర్ పుణ్యమే.

 అలాంటి కెసిఆర్ ఏకంగా మనుషుల ప్రాణాలను తీసే మొక్కను కూడా హరితహారం లో భాగం చేశారా అంటే ప్రస్తుతం అవును అనే సమాధానమే వినిపిస్తుంది. ఎన్నో దేశాలు నిషేధించిన కోనో కార్పస్ అనే మొక్కను హరితహారం లో భాగంగా నాటించారు కేసీఆర్. నగరాల నుంచి చిన్న చిన్న గ్రామాల వరకు ప్రతి చోట ఈ మొక్క పాకిపోయింది. ఈ నుండి వచ్చే వాసన పీల్చడం ద్వారా ఏకంగా శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాలలో ఒకప్పుడు విపరీతంగా ఈ మొక్కలు పెంచారు.

 కానీ ఇక ఈ మొక్క దుష్ప్రభావం ఏంటో  తెలిసి వెంటనే నిషేధించారు. అయితే ఇప్పటికే హరితహారం లో భాగంగా నాటేసిన ఈ ప్రమాద కరమైన మొక్కలు ఏపుగా పెరిగి పోయాయి. అయితే అంతలోనే ప్రభుత్వం ఇక ఈ మొక్క ప్రమాదకారి అని గుర్తించింది. జూన్ 15వ తేదీన కోనో కార్పస్ మొక్కపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.  మొక్కను నాటొద్దు అంటూ ప్రతి గ్రామపంచాయతీకి సర్కులర్ కూడా విడుదల చేసింది.

 కానీ ఏం చేస్తాం.. పంచాయతీల్లో పనిచేసే సిబ్బంది మాత్రం కేసిఆర్ చెప్పింది అసలు పట్టించుకోవట్లేదు. దీంతో ఇక ఈ కొనో కార్పస్ గురించి అసలు విషయం తెలియకుండా ఇక తెగ నాటేస్తూ ఉన్నారు. పర్యావరణానికి తాము ఏదో మంచి చేస్తున్నామని తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇక హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజాంబాద్ లాంటి నగరాలకు వెళ్లే ప్రధాన రహదారుల డివైడర్ల మధ్యలో కూడా ఎంతో అందంగా కనిపించే ఈ మొక్కలు ప్రాణాల మీదికి తెస్తాయన్న విషయం మాత్రం ఎవ్వరికి తెలియదు. దీంతో రోడ్ల మధ్యలో ఉండే ఈ అందమైన మొక్కలను చూసి వావ్ అంటున్నారు వాహనదారులు. అయితే ఇక ఇప్పటికైనా కొనో కార్పస్ అనే విష గుళిక లాంటి మొక్క గురించి అందరూ తెలుసుకోవాలని.. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగానే ఈ మొక్కను ఎక్కడ కనిపించకుండా చేయాలని.. ఈ మొక్కలను నరికేసిన పెద్దగా పోయేదేమీ లేదని. పర్యావరణాన్ని రక్షించడమే అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: