ప్రతి నెల ఏదోక సేవలలో మార్పులు వస్తూనే ఉన్నాయి.బ్యాంకు నుంచి ప్రతి సేవలలో మార్పులు వస్తూనే వున్నాయి. ఈ మేరకు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం, మెసేజింగ్ వేదిక ఫేస్‌బుక్ సమూల మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విమర్శలు వస్తున్న నేపథ్యంలో యూజర్ల ప్రొఫైల్ సమాచారానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చే అవకాశమున్నట్లు తెలిసింది.ఇప్పటికే కొందరికి సూచనలు ఇచ్చింది.డిసెంబర్ 1 నుంచి తమ నిబంధనలకు విరుద్ధంగా యూజర్ల ప్రొఫైల్స్‌లో ఏవైనా ఉంటే వాటిని ఫేస్‌బుక్ స్వయంగా తొలగిస్తుందని వార్తలొస్తున్నాయి.
అయితే, ఫేస్‌బుక్ యూజర్ల ప్రొఫైల్స్‌లో.. వచ్చే నెల నుంచి అడ్రస్, రిలీజియస్ వ్యూస్ (మతపర అభిప్రాయాలు), పొలిటికల్ వ్యూస్ (రాజకీయ పర అభిప్రాయాలు), ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో ఉండే 'ఇంట్రెస్టెడ్ ఇన్' అనే ముఖ్యమైన ఫీల్డ్ కూడా ఉండకూడదని చెబుతోంది.కాగా, దీనికి సంబంధించి తొలుత.. మాట్ నవర్రా అనే ఒక యూజర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఫేస్‌బుక్ ప్రొఫైల్స్‌లో ఏమేం మార్పులు రాబోతున్నాయో? ఫేస్‌బుక్ ఏం నోటీసులు తనకు పంపించిందో.. ఆ స్క్రీన్ షాట్లను షేర్ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దాంట్లో.. కాంటాక్ట్ అండ్ బేసిక్ ఇన్ఫో, ఇంట్రెస్టెడ్ ఇన్, రిలీజియస్ వ్యూస్ వంటి సెక్షన్లను డిసెంబర్ 1 నుంచి తీసేయనున్నట్లు అందులో ఉంది.
నెల ప్రారంభంలో మెటా ఏకంగా 11 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించుకుంది. తన వర్క్‌ఫోర్స్‌లో ఇది ఏకంగా 13 శాతం కావడం విశేషం. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఇలా చేస్తున్నట్లు మెటా ప్రకటించింది. గత కొంతకాలంగా మెటా ఆదాయం కూడా భారీగా తగ్గిపోయింది..దాంతో మరింత మందిని తొలగించే అవకాశం ఉందని తెలుస్తుంది.వాట్సాప్ ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ శివ్‌నాథ్ థుక్రాల్‌ను మెటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా నియమించారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అన్నీ దీని కిందికే వస్తాయి. అయితే.. ఆర్థిక సంక్షోభం రానున్న నేపథ్యంలో అన్ని దిగ్గజ కంపెనీలు కూడా ఉద్యోగులను తగ్గించుకునేందుకు చూస్తున్నాయి..