తెలంగాణ: పాపం కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణని వేరు చేసి అక్కడి ప్రజలకు ఫేవర్ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉన్నప్పటికి.. దానిని ఉపయోగించుకుని ముందుకెళ్ల లేకపోతుందనే అపవాదు ఈ పార్టీపై పడింది.తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కొంత దూకుడుగా ఉన్నప్పటికీ.. పార్టీలో నాయకులను సమన్వయం చేసుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారనే విమర్శలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అసలు రేవంత్ రెడ్డి కంటే సీనియర్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికి.. వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి టీపీసీసీ పగ్గాలు అప్పజెప్పడంపై ఎంతోమంది సీనియర్ నేతలు కోపంతో ఉన్నారు. కొందరు నేతలు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేసుకుంటూ ముందుకు సాగుతుంటే మరికొందరు మాత్రం బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికి.. తమకు ఏమి పట్టనట్లు వున్నారు కొంతమంది నేతలు. మరికొంతమంది అయితే టికెట్ కమిట్ మెంట్ దొరికితే వేరే పార్టీలోకి పోయేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కలహాలు అనేవి చాలా పెద్ద సమస్యగా మారింది. రేవంత్ రెడ్డి నిర్ణయాలపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు కొంతమంది నాయకులు.


తాజాగా కాంగ్రెస్ పార్టీకే చెందిన సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించడంపై సొంతపార్టీ నాయకుల నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా కొంత కాలం వెయిట్ చెయ్యాల్సిందని , కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా సార్లు పార్టీ లైన్ దాటినా చర్యలకు వెనుకాడిన పార్టీ.. శశిధర్ రెడ్డి వ్యవహరంలో ఇంత త్వరగా ఎందుకు స్పందించాల్సి వచ్చిందని అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ చెన్నారెడ్డి సమావేశం ఏర్పాటుచేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కూడా అంటున్నారు. మర్రి శశిధర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తే దానికి టీపీసీసీ చీఫ్ బాధ్యత వహించాల్సి వస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.ఇంకా అలాగే మరోవైపు జూమ్ మీటింగ్ కు హాజరుకాలేదంటూ 11 మంది నాయకులకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు సమాచారం తెలుస్తోంది. దీనిపై కూడా అనేక రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూమ్ మీటింగ్ లు పెట్టడానికి ఇది కంపెనీ కాదని, పార్టీ అంటూ జగ్గారెడ్డి కామెంట్స్ చేశారు. వారానికి ఒకసారి సమావేశం జరపాలని .. జూమ్ మీటింగ్ లు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇలా అంతర్గత కలహాలతో కాంగ్రెస్ పార్టీ చాలా ఉక్కిరిబిక్కిరవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: