ఏపీలో బీజేపీ టార్గెట్... టీడీపీకి షాక్ ?

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో బలమైన పార్టీలుగా ఉన్నవి రెండే రెండు ఒకటి అధికార పార్టీ వైసీపీ, రెండవది ప్రతిపక్ష పార్టీ టీడీపీ. గత రెండు పర్యాయాలుగా ఈ రెండు పార్టీలలో ఏదో ఒకటి అధికారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే, కానీ గత అసీంబ్లీ ఎన్నికల నుండి టీడీపీకి సపోర్ట్ గా జనసేన మరియు బీజేపీలు ప్రత్యక్షముగానో లేదా పరోక్షముగానో ఉన్న విషయం కాదనలేము. దీనిని దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే విధంగా జరగొచ్చు అన్నది రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. కానీ ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. ఎందుకంటే... గతంలో చాలాసార్లు బీజేపీ మరియు జనసేనలు కలిసి 2024 ఎన్నికలకు వెళ్లనున్నాయి అని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. అందుకు పవన్ కూడా సరే అన్నాడు... రాను రాను పవన్ లో మార్పులు రావడం ప్రారంభం అయింది.
ఇప్పుడు టీడీపీ వైపు పవన్ చూపు కనిపిస్తోంది. ఇందులో పవన్ ప్రమేయం ఎంత అయితే ఉందో, చంద్రబాబు నాయుడు ప్రమేయం కూడా అంతే ఉందనుకోవాలి. అలా ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి కలిసి అధికార వైసీపీని గద్దె దించుదాము అని ప్రతిజ్ఞ చేసుకున్నారు. దీనిని బీజేపీ ఓర్వలేక గేమ్ స్టార్ట్ చేసింది... ఎలాగైనా జనసేనను టీడీపీ నుండి దూరం చేయాలని ప్రయత్నిస్తోంది. ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు క్లియర్ గా జనసేనను టీడీపీ తో కలవకూడదు అని మోదీ చెప్పినట్లుగా బయటపెట్టాడు. ఇక ఈ కామెంట్ల తర్వాత జనసేన ను మరియు పవన్ కళ్యాణ్ ను బీజేపీ తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటోందా అన్న చర్చ మొదలైంది.
అయితే ఇందులో పెద్ద ముసలమే ఉన్నట్లు రాజకీయ వర్గాల నుండి సమాచారం అందుతోంది.. టీడీపీ జనసేన ను కలవనీయకుండా ఉంటే వైసీపీ వ్యతిరేక ఓటుకు వచ్చే ఢోకా ఏమీ లేదు. తద్వారా ఏపీలో వైసీపీని గెలిపించడం బీజేపీ టార్గెట్ అని కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పవన్ బీజేపీ అధిష్టానం మాట విని కనుక టీడీపీకి దూరమైతే చంద్రబాబుకు షాక్ అనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ బీజేపీ మాటను శిరసావహిస్తాడా లేదా బీజేపీని పక్కన పెట్టేసి టీడీపీతోనే కొనసాగుతాడా అన్నది తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: