నరేంద్ర మోదీ మాటలు ఏపీ బీజేపీ చెవికెక్కించుకుంటుందా ?

VAMSI
గత వారంలో పీఎం ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన చాలా మందికి షాక్ ఇచ్చింది అని చెప్పాలి. ముఖ్యంగా ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో జరిగిన చర్చ పట్ల ఇంకా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ సమావేశంలో మోడీ పవన్ కు బాగా తలంటారు అన్న వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం పవన్ ను మాత్రమే కాకుండా... ఏపీ బీజేపీ లోని నేతలకు సైతం గట్టిగా క్లాస్ పీకారని స్పష్టంగా తెలుస్తోంది. ప్రధానంగా ఏపీలో పాలక పక్షం అయిన వైసీపీ చేస్తున్న పొరపాట్లు లేదా తప్పులు మరియు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో బీజేపీ నాయకులు ఫెయిల్ అవుతున్నారంటూ వారిపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.

ఇకమీదట అలా జరగకుండా ఉండాలని ప్రధాని మోదీ బీజేపీ కోర్ కమిటీ సబ్యులకు సూచనలు చేశాడు. ఇక వైసీపీ సక్సెస్ కు చిహ్నంగా నిలిచిన సూత్రం... నిత్యం జనాల్లో ఉండడం. బీజేపీ నాయకులు కూడా గెలుపు ఓటముల గురించి ఆలోచించకుండా వీలైనంత మేరకు ప్రజలతో నేరుగా టచ్ లో ఉండి వారి తరపున ప్రభుత్వంతో పోరాడాలని సలహా ఇచ్చారు. ఇక రాబోయే తారలతో నాయకులుగా నిలిచే యువతను దగ్గరకు తీసుకుని.. వారి ఓట్లు పొందడానికి అవసరం అయిన ప్రణాళికలు చేసుకుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు మోదీ. ఇది మోదీ పర్యటన సమయంలో ఏపీలోని బీజేపీ నాయకులతో జరిగిన చర్చ ముఖ్యాంశం.

దీని పిదప మోదీ సూచనలు మరియు సలహాలను తూచా తప్పకుండా పాటించే నాయకులు బీజేపీలో ఉన్నారా అంటే అనుమానమే. ఎంహెదుకంటే ప్రస్తుతం బీజేపీలో ఉన్న కీలక నాయకులలో సోము వీర్రాజు, సత్యకుమార్, జివిఎల్ నరసింహారావు లు ఉన్నారు. వీరికి వైసీపీలో అగ్ర నాయకులు అందరితోనే మంచి సంబంధాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో వైసీపీ కి వ్యతిరేకంగా మాట్లాడుతారా అంటే కష్టమే అని చెప్పాలి. మొత్తానికి ఏపీలో బీజేపీని నత్తనడకన కూడా సాగించడం ఎవరితరం కాదు అన్నది రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తున్న మాటలు. మరి నిజంగా మోదీ మాటలపై గౌరవం ఉంటే వారి పనితీరు మారుతుందేమో చూద్దాం.

   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: