అచ్చెన్నాయుడును ఓడించడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు !
అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ అచ్చెన్నాయుడిని ఎదుర్కొనేందుకు టెక్కలికి వైసీపీ తరపున దువ్వాడ శ్రీనివాస్ ను ఇప్పటికే ఖరారు చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా శ్రీకాకుళం జిల్లాలో ఓడిపోకూడదని జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు , కార్యకర్తలకు గట్టిగా సూచనలు ఇచ్చాడట జగన్. అయితే ప్రజలు వైసీపీకి తప్ప మరోపార్టీకి ఓటు వేయడానికి వీలు లేకుండా ఇక్కడ ఉన్న సమస్యలపైన దృష్టిని సారించారు. అందులో భాగంగా ఇక్కడ ప్రధాన సమస్యగా మారిన ఉద్దానం కిడ్నీ కు పరిష్కారం చూపించే దిశగా తన అడుగులు పడుతున్నాయి. ఇక్కడ పెద్ద హాస్పిటల్ ను ఏర్పాటు చేస్తున్నారట.
ఇక ఈ జిల్లాలో మరో సమస్య ఉపాధి పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోవడం. ఇది ఎంతో కాలంగా జరుగుతూ వస్తోంది.. దీనికి కూడా పరిష్కార మార్గం చూపడానికి జగన్ మరియు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఈ జిల్లాలో అచ్చెన్నాయుడును ఓడించడానికి ప్రత్యేక ఫోకస్ పెట్టారట. పైన మనము చెప్పుకున్న రెండు సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికితే కనుక శ్రీకాకుళం మొత్తం వైసీపీ వశం అయినట్లే. మరి ఆ విధంగా జరుగుతుందా లేదా తెలియాలంటే ఇంకా కొంతకాలం వేచిచూడాల్సిందే.