మీకు శాలరీ అకౌంట్ ఉందా?ఈ ప్రయోజనాల గురించి తెలుసా?
సాలరీ అకౌంట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కంటే ఉచిత లావా దేవీలు ఎక్కువ గా ఉంటాయి. ఉద్యోగుల అలవెన్సులు, రీయింబర్స్ మెంట్‌లు ఈ ఖాతా లో జమ అవుతాయి.. సాలరీ అకౌంట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఇలాంటి అకౌంట్ల కి బ్యాంకు ఎటువంటి ఛార్జీల ని వసూలు చేయదు. కానీ సాధారణ పొదుపు ఖాతా లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం అవసరం. లేదంటే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది..
సాలరీ అకౌంట్ తో లింక్ అయిన చాలా బ్యాంకులు అపరిమిత లావాదేవీల ను అందిస్తాయి. అంటే నెలలో ఎన్ని సార్లు అయినా ATM లావా దేవీలు చేసుకోవచ్చు. పెనాల్టీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా బ్యాంకులు సాలరీ అకౌంట్ల పై లాకర్ ఛార్జీల ను మాఫీ చేస్తాయి. sbi లో లాకర్ ఛార్జీల పై 25 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. సాలరీ అకౌంట్ తో పాటు చాలా బ్యాంకులు డీమ్యాట్ ఖాతా, రుణ సౌకర్యం, క్రెడిట్ కార్డ్ మొదలైన సౌకర్యాల ను అందిస్తాయి. మీరు చెక్ బుక్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఇతర సౌకర్యాలు కూడా పొందుతారు.. ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయో చూసారు కదా. అందుకే శాలరీ అకౌంట్ తీసుకోవడం తప్పనిసరి..