పర్సనల్ లోన్ కోసం చూస్తున్నారా?ఇది ఒకసారి చూడండి..

Satvika
ఈరోజుల్లో పర్సనల్ లోన్ తీసుకొనేవారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుంది..లోన్ తీసుకోనె ముందు ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ రేటు ఉందో తెలుసుకోవాలి. ఏ బ్యాంక్‌లో అయితే తక్కువ వడ్డీ రేటు ఉందో అక్కడే లోన్ తీసుకోవడం ఉత్తమం. ఇప్పుడు మనం ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ రేటు ఉందో తెలుసుకుందాం.. బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్రలో పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 8.9 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు 9.75 శాతం నుంచి స్టార్ట్ అవుతుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో అయితే వడ్డీ రేటు 9.8 శాతం నుంచి ప్రారంభమౌతోంది..

బ్యాంక్ ఆఫ్ బరోడాలో పర్సనల్ లోన్ పొందాలని భావిస్తే.. వడ్డీ రేటు 10.2 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో వడ్డీ రేటు 10.25 శాతంగా ఉంది. ఇండియన్ బ్యాంక్‌లో లోన్‌పై వడ్డీ రేటు 10.3 శాతం నుంచి ప్రారంభం అవుతోంది..ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లో వడ్డీ రేటు 10.49 శాతం నుంచి పడుతుంది. ఇండస్ఇండ్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 10.49 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది. ఫెడరల్ బ్యాంక్‌లో లోన్ తీసుకుంటే 10.49 శాతం నుంచి వడ్డీ పడుతుంది..

అలాగే సౌత్ ఇండియా బ్యాంక్‌లో వడ్డీ రేటు 12.5 శాతంగా కొనసాగుతోంది. కరూర్ వైశ్యా బ్యాంక్‌లో పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 12 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. యాక్సిస్ బ్యాంక్‌లో చూస్తే.. వడ్డీ రేటు 12 శాతం నుంచే స్టార్ట్ అవుతోంది. ఇక కెనరా బ్యాంక్‌లో పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు 13.15 శాతంగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 11 శాతంగా ఉంది. దేశీ అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు 10.55 శాతం నుంచి ప్రారంభం అవుతోంది..ఇకపోతే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే వడ్డీ రేటు 10.7 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది...ఇది గమనించుకోవాల్సిన విషయం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: