అమరావతి : పిరికివాడంటు చంద్రబాబు పరువు తీసేసిన ఎల్లోమీడియా

Vijaya







ఉరిమి ఉరిమి మంగళంమీద పడిందన్నట్లుగా ఎల్లోమీడియా అటుతిరిగి ఇటుతిరిగి చివరకు చంద్రబాబునాయుడు పరువు తీసేసింది. తెలంగాణాలో తాజాగా జరుగుతున్న ఎంఎల్ఏల ట్రాపింగ్ ఘటన గురించి ప్రస్తావిస్తు చంద్రబాబును పిరికివాడుగా అభివర్ణించింది. అప్పట్లో ఓటుకునోటు వ్యవహారంలో ప్రత్యక్షంగా తనపాత్ర లేకపోయినా చంద్రబాబు పిరికితనంతో కేసీయార్ కు లొంగిపోయారని ఎల్లోమీడియా తేల్చేసింది. ఓటుకునోటు వ్యవహారంలో అప్పటి టీడీపీ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి డబ్బు దగ్గరపెట్టుకున్న కారణంగా దొరికిపోయారని చెప్పింది.




ఇదే సమయంలో ప్రత్యక్షంగా ఓటుకునోటు ఘటనలో ఆధారాలు లేకపోయినా చంద్రబాబు పిరికివాడు కాబట్టే కేసీయార్ భయపడి లొంగిపోయినట్లు చెప్పింది. విచిత్రం ఏమిటంటే నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ ఓటును కోరే హక్కు చంద్రబాబుకు ఉందని ఎల్లోమీడియా పెదరాయుడు తీర్పిచ్చేసింది.  చంద్రబాబుకే కాదు ఒకరి ఓటును కోరే హక్కు ఎవరికైనా ఉంటుంది. అయితే స్టీఫెన్ సన్ ఓటును రు. 5 కోట్లకు బేరంకుదుర్చుకునే అవకాశం చంద్రబాబుకు మాత్రమే దొరికిందని ఎల్లోమీడియా మరచిపోయింది.



చేసిన పనికి సిగ్గుపడాల్సిన చంద్రబాబు ‘నీకు ఏసీబీ ఉంటే నాకూ ఏసీబీ ఉంది..నీకు రెగ్యులర్ పోలీసుంటే నాకూ రెగ్యులర్ పోలీసుందం’టు అప్పట్లో కేసీయార్ ను చాలెంజ్ చేశారు. తర్వాత అరెస్టుకు భయపడి తెలంగాణా నుండి విజయవాడకు అర్ధరాత్రి పారిపోయారు.  దాన్ని ఇపుడు ఎల్లోమీడియా ప్రస్తావిస్తు కేసీయార్ కు ఎదురుతిరిగి పోరాటం చేసే అవకాశం ఉన్నా పిరికివాడుగా చంద్రబాబు పారిపోయారని గబ్బు పట్టిచ్చేసింది.



నిజానికి ఇప్పటి వివాదం గురించి ప్రస్తావన చేయదలచుకుంటే కేవలం ఎంఎల్ఏల కొనుగోళ్ళు గురించి మాత్రమే పరిమితవ్వచ్చు. కానీ అలా ఉండకుండా అప్రస్తుతంగా ఓటుకునోటు కేసును ప్రస్తావించటం, కేసీయార్ కు చంద్రబాబు సరెండర్ అయిపోయారని, పిరికివాడుగా చంద్రబాబు విజయవాడ పారిపోయారని చెప్పటమంటే చంద్రబాబు ఎంతటి ధైర్యవంతుడో జనాలందరికీ టముకేసి చెప్పినట్లే ఉంది. మొత్తానికి చంద్రబాబును భయపెట్టినంత ఈజీకాదు నరేంద్రమోడీ, అమిత్ షా ను భయపెట్టడం అని ఎల్లోమీడియా చెప్పదలచుకున్నది. ఈ విషయాన్నే డైరెక్టుగా చెప్పకుండా మధ్యలో చంద్రబాబును పిరికివాడుగా ముద్రవేసేయటమే ఆశ్చర్యంగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: