అమరావతి : లోకేష్ భవిష్యత్ తేల్చేశారా ?

Vijaya






నియోజకవర్గాల సమీక్షలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రైజ్ చేశారు. అదికూడా కొడుకు నారా లోకేష్ పోటీచేస్తానని చెబుతున్న మంగళగిరి నియోజకవర్గంపైన. కర్నూలు, కుప్పం, మంగళగిరి, ఇచ్చాపురం నియోజకవర్గాల ఇన్చార్జిలతో సమీక్షించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అంతాబాగానే ఉందికానీ చివరలో లోకేష్ తో చంద్రబాబు చెప్పిన మాటలే ఇంట్రెస్టింగుగా ఉన్నాయి.





మొన్నటిఎన్నికల్లో ఓడిపోయినదగ్గరనుండి తాను నియోజకవర్గంలో ఎంతగా కష్టపడుతున్నది, జనాలు ఎలా స్పందిస్తున్నారనే విషయాన్ని లోకేష్ వివరించారు. నియోజకవర్గంలో తాను అమలుచేస్తున్న సంక్షేమపథకాలను కూడా లోకేష్ చెప్పారు. అంతావిన్న తర్వాత చంద్రబాబు మాట్లాడుతు గడచిన ఆరుఎన్నికల్లో మంగళగిరిలో టీడీపీ అసలు పోటీనే చేయని విషయాన్ని గుర్తుచేశారు. 1989 నుండి ఏదోపార్టీతో పొత్తున్న కారణంగా నియోజకవర్గాన్ని మిత్రపక్షానికి ఇచ్చేయాల్సొస్తోందట.





ఎన్నో సంవత్సరాల తర్వాత 2019 ఎన్నికలోనే టీడీపీ డైరెక్టుగా పోటీచేసిన విషయాన్ని చంద్రబాబు చెప్పారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని గెలుపుకు అవసరమైన అన్నీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలక్షనీరింగ్ చాలా ముఖ్యమని ఆ విషయంలో దృష్టిపెట్టమని గట్టిగా చెప్పారు. అంతాబాగానే ఉందికానీ అసలు ఆరు ఎన్నికల్లో పార్టీ పోటీచేయలేదంటేనే పార్టీ క్యాడర్ ఎంత వీగ్గా ఉందో అర్ధమైపోతోంది. వరుసగా రెండు ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందంటేనే మూడోఎన్నికకు నేతలు, క్యాడర్ దొరకని ఈ రోజుల్లో ఆరు ఎన్నికల్లో అసలు పోటీకే దూరంగా ఉండటమంటే మామూలు విషయంకాదు.





ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే అధికారంలో ఉన్నపుడే మంగళగిరిలో లోకేష్ ఓడిపోయారు. ఇపుడు ప్రతిపక్షంలో ఉండి పోటీచేస్తే ఎలా గెలుస్తారు ? లోకేష్ అదృష్టం సంగతిని వదిలేస్తే లాజికల్ గా గెలుపుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నియోజకవర్గంలో పార్టీకి చెప్పుకోదగ్గ నేతలు, క్యాడర్ లేరు. ఉన్న గంజి చిరంజీవి కూడా ఈమధ్యనే వైసీపీలో చేరిపోయారు. దాంతో పార్టీ మరింత బలహీనంగా తయారైంది. ఇలాంటి పరిస్ధితిలో చంద్రబాబు దిశానిర్దేశం చేస్తు పార్టీ రికార్డును తిరగరాయాలని చెప్పటం దానికి లోకేష్ బదులిస్తు రికార్డు సృష్టిస్తానని చెప్పటం భలేగుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: