ఇప్పుడు అన్నిటికీ ఆధార్ కార్డు అనేది తప్పనిసరి..చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకూ అన్నిటికీ ఆధార్ వుంటేనే పని పూర్తి అవుతుంది.రేషన్ కు, చదువుకు ఇలా ఒకటేమిటి ప్రతి దానికి కూడా ఆధార్ ఉండాలి.. అత్యవసర డాక్యుమెంట్స్ లో ఒకటి అని చెప్పాలి..అనేక చోట్ల
ఆధార్ కార్డ్ తప్పనిసరి.పీఎం కిసాన్ పథకం, ఇతర ప్రభుత్వ స్కీమ్స్‌తో ఆధార్ నెంబర్ తప్పనిసరి. ఆధార్ నెంబర్ ఆధారంగానే
బ్యాంక్ అకౌంట్లకు ప్రత్యక్షంగా నగదు బదిలీ చేస్తోంది ప్రభుత్వం.
ఆధార్ కార్డ్ ఉపయోగం పెరుగుతుండటంతో అందులోని వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు
ఆధార్ కార్డ్ హోల్డర్స్. అయితే ఆధార్ సేవల విషయంలో
ఆధార్ కార్డ్ హోల్డర్స్‌కు పలు సమస్యలు ఉంటున్నాయి.
ఎవరికి ఫిర్యాదు చేయాలో, ఎలా కంప్లైంట్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు.యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్
ఇండియా అనేక మార్గాల్లో ఆధార్ సంబంధిత ఫిర్యాదుల్ని స్వీకరిస్తోంది. ఆ ఫిర్యాదుల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తోంది.
ఫోన్ కాల్, చాట్ బాట్, ఇమెయిల్, వెబ్సైట్, పోస్ట్... ఇలా వేర్వేరు మార్గాల్లో యూఐడీఏఐకి ఆధార్ సంబంధిత ఫిర్యాదులు చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి..
ఆధార్ కార్డ్ హోల్డర్స్ నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు
యూఐడీఏఐ 1947 నెంబర్‌ను ఏర్పాటు చేసింది. ఇది టోల్ ఫ్రీ నెంబర్.యూఐడీఏఐ ఆస్క్ ఆధార్ పేరుతో ఛాట్ బాట్ ఏర్పాటు చేసింది. ఇది ఆటోమెటెడ్ ఛాట్ ప్లాట్‌ఫామ్. మీ ఫిర్యాదులకు ఆటోమేటెడ్ రెస్పాన్స్ వస్తుంది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఛాట్‌బాట్ అందుబాటులో ఉంది..యూఐడీఏఐ రెసిడెంట్ పోర్టల్‌లో కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. https://resident.uidai.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత Contact & Support సెక్షన్లో File a complaint పైన క్లిక్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. మీ 14 అంకెల ఎన్రోల్మెంట్ ఐడీ, ఇతర వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది..ఆధార్ సేవలకు సంబంధించి ఇమెయిల్ ద్వారా కూడా యూఐడీఏఐకి కంప్లైంట్ చేయొచ్చు. help@uidai.gov.in మెయిల్ ఐడీకి ఇమెయిల్ పంపాలి.
యూఐడీఏఐ రీజనల్ కార్యాలయాలకు వెళ్లి నేరుగా కంప్లైంట్స్ చేయొచ్చు. ఆధార్ సంబంధిత వివరాలు తెలుసుకోవచ్చు. పోస్టు ద్వారా కూడా మీ ఫిర్యాదును పంపొచ్చు.
యూఐడీఏఐ హెడ్‌క్వార్టర్స్, రీజనల్ ఆఫీసులకు మీ ఫిర్యాదును పోస్టు ద్వారా పంపాలి.
యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్లో అడ్రస్‌లు ఉంటాయి..ఇలా చేసి తప్పులను సరి చెయ్యండి..