హైదరాబాద్ : ఇది కోమటిరెడ్డి వెన్నుపోటేనా ?
ఆస్ట్రేలియాలో తనను కలిసిన కొందరితో వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు మునుగోడులో హాట్ టాపిక్ అయిపోయింది. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎంపీ చెప్పారు. ఐదుసార్లు ఎంఎల్ఏగా ఇపుడు ఎంపీగా ఉన్న ఇక తనకు కావాల్సిందేమీ లేదన్నారు. అవసరమైతే తాను రిటైర్ అయిపోతానని కూడా చెప్పారు. తాజాగా ఎంపీ మాటలు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచినట్లుగానే ఉంది.
మునుగోడులో ఎవరు పోటీచేయాలని అనుకున్నపుడు పాల్వాయి స్రవంతికి టికెట్ ఇస్తే తాను దగ్గరుండి గెలిపించుకుని వస్తానని ఎంపి అధిష్టానానికి చెప్పారు. అందుకనే పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సూచించిన నేతను కాదని ఎంపీ చెప్పిన స్రవంతికే టికెట్ ఇచ్చింది. అయితే బీఫారం ఇచ్చిన తర్వాత అభ్యర్ధిని ఎంపీ గాలికొదిలేశారు. చిన్న చిన్న విషయాలను బూతద్దంలో చూపించి కావాలనే గొడవలు వేసుకున్నారు. ఉపఎన్నికల ప్రచారాన్ని ఎగొట్టడమే ధ్యేయంగా పావులు కదిపారు.
అందుకనే కొద్దిరోజులు రేవంత్ తీరును తప్పుపట్టి మరికొద్దిరోజులు అద్దంది దయాకర్ తో గొడవలు పడ్డారు. తన అవమానిస్తున్నారని కొద్దిరోజులు, తనను పట్టించుకోవటంలేదని, తనను ఎవరు ప్రచారానికి రమ్మని అడగలేదని ఇలా గొడవలు వేసుకుని చివరకు కుటుంబంతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయారు. కాంగ్రెస్ లో ఉంటు బీజేపీ తరపున పోటీచేస్తున్న తమ్ముడి గెలుపుకు సహకరించటం సాధ్యంకాకే చివరకు ఎంపీ విదేశాలకు వెళిపోయారు. ఇదే విషయమై ఇపుడు పాల్వాయి స్రవంతి మాట్లాడుతు తనను ఎంపి నమ్మించి మోసంచేశారంటు గోలచేస్తున్నారు. చివరకు పార్టీతో పాటు అభ్యర్ధికి కూడా ఎంపీ వెన్నుపోటు పొడిచినట్లే అందరు అనుకుంటున్నారు.