ఖాతాదారులకు అలర్ట్..ఆ 3 రోజులు బ్యాంకులకు సెలవు..

Satvika
ప్రభుత్వ హాలిడేస్ బ్యాంకులకు కూడా హాలిడేస్ అన్న విషయం తెలిసిందే.. ప్రతి నెలలో కొన్ని సెలవులు ఉంటాయన్న సంగతి తెలిసిందే.. దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూడు రోజుల పాటు మూతపడనున్నాయి.. దీపావళి, నాలుగో శనివారం, ఆదివారం ఇలా వరుస సెలవులు రావడమే ఇందుకు కారణం.ఈ నేపథ్యంలో బ్యాంక్ ఖాతాదారులు ఏమైనా బ్యాంకుల్లో అత్యవసర పనులు ఉంటే ఈ రోజు అంటే.. శుక్రవారమే పూర్తి చేసుకోవడం బెటర్..


మంగళవారం అంటే 25 వ తేదీ వరకు ఆగాల్సి వస్తుంది. ఈ నెల 22వ తేదీ నాలుగో శనివారం సందర్భం గా బ్యాంకుల కు సాధారణంగా సెలవు ఉంటుంది. మరుసటి రోజు 23వ తేదీ ఆదివారం కావడం తో సెలవు ఉంటుంది. ఆ మరుసటి రోజైన సోమవారం 24 వ తేదీన దీపావళి సందర్భంగా సెలవు ఉంటుంది. దీంతో ఈ మూడు రోజులు బ్యాంకుల కు వరుస సెలవులు రానున్నాయి..


తెలంగాణ ప్రభుత్వం దీపావళి సెలవు విషయంపై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సెలవు రోజును మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా అక్టోబర్ 25న దీపావళి సెలవు ను ప్రకటించింది ప్రభుత్వం. తాజాగా ఆ సెలవుల ను అక్టోబర్ 24 సోమవారానికి మార్చింది.. తాజాగా తీసుకున్న నిర్ణయం తో సెలవు విషయంలో ఏర్పడిన గందరగోళానికి చెక్ పడింది.



ముందుగా ఈ నెల 24వ తేదీ అంటే మంగళవారం రోజు దీపావళి సెలవును ప్రభుత్వం ప్రకటించింది. పండితులు మాత్రం సోమవారమే దీపావళి అంటూ ప్రకటించారు. దీంతో పండుగ ఒకరోజు.. సెలవు మరొక రోజు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వానికి సెలవులు మార్చాలని వినతులు అందాయి.. మొత్తానికి వరుసగా మూడు రోజులు సెలవులు అన్న విషయాన్ని గ్రహించండి.. ఆయా వినతులను పరిగణలోకి తీసుకున్న కేసీఆర్ సర్కార్ సెలవు రోజును మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు ఉత్తర్వులను జారీ చేసింది. సెలవు సోమవారానికి మార్చడంతో ఆదివారం, సోమవారం వరుసగా రెండు రోజుల పాటు విద్యార్థులకు సెలవులు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: