అమరావతి : జగన్ మంచిపనే చేశాడా ?

Vijaya





థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్విరాజ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి మంచిపనే చేశారని ఇపుడు అనిపిస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే  టీటీడీ ఆధ్యాత్మిక ఛానల్ ఎస్వీబీసీ ఛైర్మన్ గా పృధ్విరాజ్ ను నియమించారు. ఎస్వీబీసీ ఛానల్ కు పృధ్వి ఛైర్మన్ కాగానే చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న కొద్దిరోజులకే రాజీనామా చేయాల్సొచ్చింది. కారణం ఏమిటంటే అక్కడ పనిచేసే ఒక మహిళా ఉద్యోగిని గోకారట.



వాళ్ళిద్దరి మధ్య ఫోన్ సంభాషణ లీకవ్వటంతో ప్రభుత్వం విచారణ జరిపించి పృధ్విని తప్పించింది. ఆ తర్వాత ఈ నటుడు జగన్ను కలవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో కోపమొచ్చి పార్టీలో నుండి బయటకు వెళిపోయారు. అప్పటినుండి జగన్ కు వ్యతిరేకంగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇపుడిదంతా ఎందుకంటే పృధ్వి తన భార్యకు నెలకు రు. 8 లక్షలు భరణంగా ఇవ్వాలని కోర్టు తీర్పుచెప్పింది.



సినిమాల్లో ప్రయత్నం చేసుకుంటున్నపుడేమో భార్యతో అత్త, మామల ఇంట్లోనే ఉండేవాడట. అప్పట్లో ఆయన ఖర్చంతా మామగారే భరించారట. సినిమాల్లో ఛాన్సులు రావటం మొదలై కాస్త పేరు రాగానే భార్యను తన్ని తరిమేశాడట. ఆయన భార్య కోర్టులో చెప్పిన వివరాల ప్రకారమే పృధ్వి నెలకు రు. 30 లక్షలు సంపాదిస్తున్నాడట. కష్టాల్లో ఉన్నపుడేమో భార్య సాయంతో రోజులు నెట్టుకొచ్చి ఫీల్డులో నిలదొక్కుకన్న తర్వాత భార్యను రోడ్డుమీదకు పడేయటం ఏమిటో అర్ధం కావటంలేదు.



ఏదేమైనా కోర్టు తీర్పు తర్వాత పృధ్వి అసలు స్వరూపం బయటపడింది. ఇపుడు ఈ నటుడు జనసేనలో కాకుండా వైసీపీలోనే ఉండుంటే టీడీపీతో పాటు  ఎల్లోమీడియా గోల ఓ రేంజులో ఉండుండేది. పృధ్విని అడ్డుపెట్టుకుని జగన్ పై చల్లే బురద అంతా ఇంతా ఉండేదికాదు. ఇపుడు ఈ నటుడు జనసేనలో ఉండేసరికి కేవలం కోర్టు ఆదేశాలను మాత్రమే వార్తగా ఇచ్చి ఊరుకున్నారు. టీడీపీ వాళ్ళయితే అసలు నోరెత్తితే ఒట్టు. మొత్తానికి పృధ్దిని బయటకుపంపేసి జగన్ మంచిపనే చేశారని అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: