అమరావతి : పాదయాత్రలో బౌన్సర్లు ఎందుకున్నారు ?

Vijaya







అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్ తో అమరావతి టు అరసవల్లికి పాదయాత్ర మొదలైంది. పాదయాత్ర చేయటం, రైతులు+ రైతుల ముసుగులో టీడీపీ నేతలు+రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లు తదితరులు కూడా పాదయాత్రలో కలిసిపోయారు. అంతాబాగానే ఉందికానీ ఈ పాదయాత్రలో చాలామందిని ఆకర్షిస్తున్నది మాత్రం బౌన్సర్లే. మామూలుగా బౌన్సర్లంటే సెలబ్రిటీలు దగ్గర పనిచేస్తారు. అలాగే ప్రముఖులు, బాగా డబ్బున్న వాళ్ళు బౌన్సర్ల రూపంలో ప్రైవేటు సెక్యూరిటిని ఏర్పాటు చేసుకుంటారు.



మరి పాదయాత్రగా వెళుతున్న అమరావతి ఉద్యమకారులకు బౌన్సర్ల అవసరం ఏమొచ్చింది ? పాదయాత్రకు ఎలాగూ పోలీసుల బందోబస్తుంది. పోలీసులున్నా వాళ్ళకి అదనంగా పాదయాత్ర నిర్వాహకులు బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారంటే అర్ధమేంటి ? మామూలుగా బౌన్సలర్ల డ్యూటీ ఏమిటంటే తమను ఎంగేజ్ చేసుకున్న వారికి ఇతరులనుండి ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవటమే.



మరిపుడు ఉద్యమకారులుగా చెప్పుకునేవారు బౌన్సర్లను పెట్టుకున్నారంటే ఎవరినుండి ఆపద వస్తుందని ఆందోళనపడుతున్నారు ? పాదయాత్ర కోస్త జిల్లాల్లో ఉన్నంతవరకు ఎలాంటి సమస్య ఎదురుకాదనే అనుకుంటున్నారు. అయితే ఈ పాదయాత్ర ఉత్తరాంధ్ర అంటే ముందుగా వైజాగ్ దగ్గరకు చేరుకున్న తర్వాత నుండి తమపై ఎవరైనా దాడులు చేస్తారని ఉద్యమకారులు అనుమానిస్తున్నారా ? ఎవరైనా తమపై దాడులుచేసినా పోలీసులు తమను రక్షించలేరని నిర్వాహకులు డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే పెద్దఎత్తున బౌన్సలర్లతో ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు.



అయినా ఉత్తరాంధ్రలో తమపై దాడులు జరగచ్చని అనుమానిస్తున్న ఉద్యమకారులు నిజంగానే దాడులు జరిగితే తట్టుకోగలరా ? తమపై జరుగుతుందని అనుకుంటున్న దాడులను  ఈ బౌన్సర్లు అడ్డుకోగలరనే నిర్వాహకులు అనుకుంటున్నారా ? తమకు ఏమీ కాకూడదని ముందు జాగ్రత్తలు తీసుకోవటంలో ఎలాంటి తప్పులేదు. అయితే ఇదే సమయంలో మూడురాజధానుల మద్దతుదారులను రెచ్చగొట్టేట్లుగా మాట్లాడటం కూడా ఎంతమాత్రం మంచిదికాదు. ఒకవైపు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతు మరోవైపు తమను మాత్రం ఎవరు ఏమీ మాట్లాడకూడదనటం పిచ్చితనమే. అదే జరిగితే ఎంతమంది బౌన్సలర్లను పెట్టుకున్నా ఎవరినీ ఎవరు రక్షించలేరన్నది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: