బాలాపూర్ మొదటి లడ్డు.. ఎంత పలికిందో తెలిస్తే షాకే?
అయితే బాలాపూర్ లడ్డు కొనుగోలు చేస్తే వినాయకుడి కృపాకటాక్షాలు లభిస్తాయని భక్తుల ప్రగాడంగా విశ్వాసిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎంతో మంది రాజకీయ నాయకులతో పాటు వ్యాపారవేత్తలు సైతం బాలాపూర్ లడ్డూ వేలం పాట లో పాల్గొంటూ ఉంటారు అని చెప్పాలి. ఈ ఏడాది లడ్డూ వేలం పాట ఏకంగా 24.60 లక్షల రూపాయలు పలికింది. గత ఏడాదితో పోల్చి చూస్తే 5.70 లక్షలు అదనంగా వచ్చింది అని చెప్పాలి. గత ఏడాది మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కలిసి 18.9 లక్షలకు బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు. ఇరవై ఏళ్లుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా బాలాపూర్ లడ్డూ వేలం ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది.
అయితే బాలాపూర్ లో గణేశుని లడ్డూ సాంప్రదాయం 1980లో ప్రారంభమైంది. లడ్డు వేలం పాట మాత్రం 1993 నుంచి ప్రారంభించారు. ఇటీవలికాలంలో లక్షల రూపాయలు పలికిన బాలాపూర్ లడ్డూ వేలం పాట మాత్రం మొదటి ఏడాది అంటే 1994లో ఈ లడ్డూ వేలం పాట ప్రారంభించే సమయంలో వేలంపాటలో లడ్డు ఎంత పలికింది తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ అవాక్కవుతారు అనే చెప్పాలి. 1994లో కొలన్ మోహన్ రెడ్డి వేలంపాటలో పోటీపడి మరీ బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు. ఎంత కొనుగోలు చేశారో తెలుసా.. కేవలం 450 రూపాయలు మాత్రమే. ఇంకా తర్వాత 1995 ఏడాదిలో కొలను మోహన్ రెడ్డి 4500 లడ్డు కొనుగోలు చేసాడు. ఇలా మొదలై ఈ ఇరవై నాలుగు లక్షలకు బాలాపూర్ లడ్డూ వేలం చేరింది.