అమరావతి : జగన్ పరిస్ధితి ఇంత అన్యాయమైపోయిందా ?

Vijaya






ఇపుడిదే విషయం పార్టీతో పాటు జనాల్లో కూడా హాట్ టాపిక్ అయిపోయింది. ఎంఎల్ఏలుగా టికెట్లిచ్చి, ప్రచారంచేసి గెలిపించుకుని చివరకు మంత్రిపదవులు ఇచ్చారు. అయితే మంత్రివర్గంలోని చాలామంది అసలు జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోవటమే మానేశారు. టీడీపీ నేతలు జగన్+వైఎస్ భారతిపై ఎంతటి ఆరోపణలు చేస్తున్నా మంత్రుల్లో చాలామంది అసలు తమకు పట్టనట్లే ఉంటున్నారు. దాంతో చివరకు టీడీపీ నేతల ఆరోపణలకు మంత్రులు ఎందుకు కౌంటర్లు ఇవ్వటంలేదని స్వయంగా జగనే మంత్రులను అడుక్కోవాల్సొచ్చింది.




ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎవరో ఇరుక్కుంటే అందులోకి టీడీపీ నేతలు జగన్, భారతితో పాటు విజయసాయిరెడ్డిని లాగేశారు. జగన్+విజయసాయిరెడ్డిపైన ఆరోపణలు చేశారంటే అర్ధముంది. కానీ మధ్యలో భారతిని ఎందుకు లాగినట్లు ? లిక్కర్ స్కాంలో భారతి ఇరుక్కున్నారంటు ఐ టీడీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఫొటోలు వేసి తీవ్రమైన ఆరోపణలే చేస్తోంది. ఇదే సమయంలో టీడీపీ గ్రూపుల్లో భారతి అరెస్టయినట్లు, బెయిల్ పై బయటకు వస్తున్నట్లు ఫొటోలను మార్పింగ్ చేసి వైరల్ చేస్తున్నారు.



భారతిపై టీడీపీ నేతలు ఇంత దుష్ప్రచారం చేస్తున్నా మంత్రులు తమకేమీ పట్టనట్లు అసలు పట్టించుకోనేలేదు. ఎంఎల్ఏ టికెట్లు కావాలని, మంత్రిపదవులు కావాలని వెంపర్లాడిన నేతలు చివరకు జగన్+భారతిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న ఇంగితం కూడా రాకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే మంత్రిపదవులన్నది తాము ప్రోటోకాల్ అనుభవించటానికి, సౌకర్యాలు అనుభవించటానికే కానీ మిగిలిన విషయాలతో తమకు సంబంధంలేదని మంత్రులు చెప్పక్కనే చెప్పేశారు. ఇందుకనే క్యాబినెట్ సమావేశంలో మంత్రులపై జగన్ ఫుల్లుగా ఫైరయ్యారు.




తమ అధినేతపై మంత్రుల్లో అభిమానం లేకపోయిన తర్వాత జగన్ ఎంత ఫైర్ అయితే మాత్రం ఏమిటి ? ఉపయోగం. వీళ్ళని మంత్రివర్గంలోకి తీసుకునేటపుడు ఇది ఎన్నికల క్యాబినెట్ అని జగన్ చెప్పారు. అంటే తమ శాఖలతో పాటు పార్టీని కూడా ఈ మంత్రులు పట్టించుకోవాలి. కానీ శాఖలను ఏమి పట్టించుకుంటున్నారో తెలీదుకానీ జగన్+పార్టీని మాత్రం గాలికొదిలేసినట్లే అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: