బీజేపీ వ్యతిరేక పార్టీలు మోదీని పడగొడతాయా ?

VAMSI
గత రెండు దశల ఎన్నికల నుండి కేంద్రంలో ఎన్డీయే కూటమి కొనసాగుతోంది. ఈ కూటమిలో బలమైన పార్టీ బీజేపీ. ఈ రెండు దశలలో బీజేపీ దేశమంతా తన బలాన్ని పెంచుకుంటూ పోతోంది. అందుకోసం మోదీ మరియు అమిత్ షా ల నాయకత్వంలోని బీజేపీ నాయకులు ఏమి చేయడానికి అయినా సిద్దపడుతున్నారు. కానీ ప్రజలు అనుకుంటున్న ప్రకారం బీజేపీ పాలనలో సంతోషంగా లేమని, మంచి జరగలేదని... మనిషికి అవసరం అయినా నిత్యావసరాలు గ్యాస్, పెట్రోల్ డీజిల్, వంట నూనెల ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోయాయని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

అందుకే ఈసారి మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని వ్యాఖ్యలు చేషున్నారు. కాగా వీరికి తోడు బీజేపీ ఇతర పార్టీలు అన్నీ కలిసి బీజేపీని పడగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల నుండి తెలంగాణ సీఎం కేసీఆర్ కారాలు మిరియాలు నూరుతున్నారు. అవకాశము వచ్చినపుడల్లా మీడియా ముఖంగా విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. అంతే కాకుండా దేశం మొత్తం తిరిగి బీజేపీ ఇతర పార్టీలను కలుపుకుని ఒక జాతీయ ఫ్రంట్ గా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో బీజేపీ కూటమిని ఓడించాలని వ్యూహాలు రచిస్తున్నారు.

ఇందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్, వెస్ట్ బెంగాల్, బీహార్ లాంటి రాష్ట్రాల సీఎం లను కలిసి వారి మద్దతును కూడగట్టేందుకు తిరుగుతున్నారు. దాదాపుగా బీజేపీ పాలక రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాలు అన్నీ బీజేపీని గద్దె దించాలని సంకల్పంతోనే ఉన్నారు. అయితే ఇంతమంది కలిసి  ఎన్ని కుయుక్తులు పన్నినా మోదీ నిర్మించుకున్న ఈ బీజేపీ సామ్రాజ్యాన్ని పడగొట్టగలరా అన్నది ప్రశ్నగా మిగిలింది. ఎవరు ఎన్ని విధాలుగా కలిసి వచ్చిన ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మోదీ ప్రభత్వాన్ని పడగొట్టడం కష్టం అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: