బీజేపీ, కాంగ్రెస్ లకు ధీటుగా కొత్త జాతీయ పార్టీ ?
అయితే గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ కి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో సత్తా చాటడానికి బీజేపీ ఇతర రాష్ట్రాల నాయకులతో చర్చలు జరిపారు. కానీ ఎందుకో అది ఇంకా నత్త నడకన సాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే... ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఈ రెండు పార్టీలకు ధీటుగా ఒక జాతీయ పార్టీని స్థాపించడానికి అడుగులు వేస్తున్నారు. కొద్ది కాలం క్రితమే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరియు మాజీ కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుండి దేశ రాజకీయాల గురించి సుదీర్ఘ చర్చల అనంతరం తాజాగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అయితే గులాం నబీ ఆజాద్ చెప్పిన ప్రకారం వీలైనంత త్వరలోనే జాతీయ పార్టీని ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బీజేపీ అనేక రాష్ట్రాలలో బలంగా ఉండడం మరియు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ చాలా బలహీన పడడం వంటి కారణం వలన ఆజాద్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి... తన పార్టీ ని ఇక్కడ నుండే స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. మరి చూద్దాం ఈ పార్టీ బీజేపీ మరియు కాంగ్రెస్ లకు ధీటుగా ఉంటుందా ? లేదా అన్నది చూడాలి.