ఇక ప్రస్తుతం వైసీపీలో ఉన్న నేతలే అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయించారని.. ప్రజారాజ్యం పార్టీ కనుక ఉండి ఉంటే ఏపీకి అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.కడప జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయంని అందించేందుకు రైతుభరోసా యాత్రను ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా రాజంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.ఈ ప్రస్తుత ప్రభుత్వంలో రెడ్లకు మాత్రమే మేలు జరుగుతోందన్న అభిప్రాయం ఉందని.. కానీ వారికీ అసలు మేలు జరగడం లేదన్నారు.ఇంకా కడప జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల్లో అత్యధికులు రెడ్లేనన్నారు. ప్రభుత్వం వారికి సాయం చేయకపోవడం వల్లనే తాను ఇలా చేస్తున్నాన్నారు. పద్యం పుట్టిన ప్రాంతంలో మద్యం ఏరులైపారుతోందన్నారు.ఇంటికో ఉద్యోగం రాలేదు కానీ ఇంటింటికి చీప్ లిక్కర్ మాత్రం వస్తోందని యువత చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధులు సంచరించిన ప్రాంతంలో పేదరికం అనేది తాండవిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తాను వ్యక్తులపై పోరాటం చేయనని.. భావాలపైనే చేస్తాన్నారు.
ఎవరి కాళ్లపై వారు నిలబడేలా ప్రభుత్వం చేయాలన్నారు. ఇక అలా చేయకపోతే ఎంత చదువుకుంటే ఏం ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు. పేదరికానికి కులం ఉండదని కూడా గుర్తు చేశారు. కుల రాజకీయాల కోసం తాను జనసేన పార్టీని స్థాపించలేదని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.అసలు వాటి గురించి తాను ఆలోచించనన్నారు.వారసత్వ రాజకీయాలకు కొంత మేరకైనా అడ్డుకట్ట వేయాల్సి ఉందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కుల, మతాలతో రాజకీయం చేస్తే దేశం విచ్చిన్నం అవుతుందని ఆయన అన్నారు. అన్న పట్టించుకోకపోవడంతోనే ఇక చెల్లెలు వేరే రాష్ట్రంలో పార్టీ పెట్టారని గుర్తు చేసారు.రాయలసీమలో బడుగు ఇంకా బలహీన వర్గాల గురించి ఎవరూ ఆలోచించలేదన్నారు.అన్నికుల్లాలో పేదలున్నారని కూడా గుర్తు చేశారు. కులం, మతం ఇంకా ప్రాంతం దాటి వచ్చిన మనిషిని తానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించుకున్నారు.