హైదరాబాద్ : బండి ఓవరాక్షన్ కు కారణమిదేనా ?

Vijaya





తెలంగాణాలో బీజేపీ వ్యవహారం చూస్తుంటే మరీ ఓవరాక్షన్ చేస్తున్నట్లే ఉంది. పార్టీ చీఫ్ బండి సంజయ్ చేస్తున్న ఈ ఓవర్ యాక్షన్ను జనాలు భరించగలరా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఒక సమావేశంలో బండి మాట్లాడుతు టీఆర్ఎస్ కు చెందిన 50 మంది ఎంఎల్ఏలు రాజీనామాలు చేసి బీజేపీలో చేరటానికి రెడీగా ఉన్నట్లు చెప్పారు. ఆ 50 మంది ఎంఎల్ఏ పదవులకు రాజీనామాలు చేసి బీజేపీలో చేరి మళ్ళీ ఉపఎన్నికలను ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించారు.



ఇక్కడే బండి మాటలు ఎంత అబద్ధాలో తెలిసిపోతోంది. నిజంగానే టీఆర్ఎస్ కు చెందిన 50 మంది ఎంఎల్ఏ పదవులకు రాజీనామాలు చేయటానికి రెడీగా ఉన్నారంటే ఎవరు నమ్మటంలేదు. అదే నిజమైతే ఈపాటికే వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకుని ఎందుకు రాజీనామాలు చేయించలేదు ? షెడ్యూల్ ఎన్నికల్లోపు ఎన్ని నియోజకవర్గాల్లో వీలైతె అన్నీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు తెప్పించటమే వ్యూహంగా బీజేపీ పావులు కదుపుతోంది.



మరీ బీజేపీ వ్యూహానికి తగ్గట్లుగానే 50 మంది రాజీనామాలు చేయటానికి రెడీగా ఉంటే ఇంకా బీజేపీ ఎందుకు ఊరుకున్నట్లు ? మునుగోడు నియోజకవర్గంతో పాటు అన్నింటికి కలిపి ఒకేసారి ఉపఎన్నికలు పెట్టించచ్చుకదా. అయినా 50 మంది టీఆర్ఎస్ ఎంఎల్ఏలను లాగేసుకుని వాళ్ళతో బీజేపీ రాజీనామాలు చేయిస్తుంటే కేసీయార్ చూస్తు ఊరుకుంటారా ? 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు వెళ్ళేబదులు ఏకమొత్తంగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళటమే మేలని కేసీయార్ ఆలోచించరా ?




బండి ఎంతగా గోలచేస్తున్నా వాస్తవం ఏమిటంటే 119 నియోజకవర్గాల్లో బీజేపీకి మహావుంటే ఓ 30 నియోజకవర్గాల్లో మాత్రమే గట్టి అభ్యర్ధులుంటారు. మిగిలిన నియోజకవర్గాల్లో వలసనేతలే గతి. అందుకనే ఎన్నికల్లో పోటీచేయించేందుకు కూడా గట్టిఅభ్యర్ధులు లేరనే అవమానాన్ని తప్పించుకునేందుకే వలసలను భారీగా  ప్రోత్సహిస్తోంది. బీజేపీకి అన్నీ నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులు లేరన్న విషయం అందరికీ బాగా తెలుసు. ఈ పరిస్ధితుల్లో కేసీయార్ గనుక ముందస్తు ఎన్నికలకు వెళితే బీజేపీకి ఇబ్బందులు తప్పవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: