కరోనా మహమ్మారీ తెచ్చిన లాక్ డౌన్ ద్వారా చాలా మంది ఉద్యోగులు కూడా తమ ఇంటి నుంచే ఉద్యోగాలు చేస్తూ వున్నారు. ఇంకా ఇప్పటికీ కూడా ఇంటి వద్దనే తమ ఆఫీస్ పనులు చేసుకుంటున్నారు.ఇక వర్క్ ఫ్రం హోంపై కేంద్ర వాణిజ్య శాఖ కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేయడం జరిగింది.స్పెషల్ ఎకనమిక్ జోన్స్(సెజ్)లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఏడాది పాటు వర్క్ ఫ్రం హోం చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది.మొత్తం ఉద్యోగుల్లో గరిష్టంగా 50 శాతం మందికి ఈ అవకాశం అనేది కల్పిచ్చింది. ఏడాది పూర్తయినా సరే కొన్ని సందర్భాలలో ఉద్యోగులకు మరో ఏడాది పాటు వర్క్ ఫ్రం హోం కొనసాగించే వెసులు బాటు కూడా కల్పిచ్చింది.ఇక 50 శాతానికి మించి ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పనిచేయాలంటే..సంబంధిత కారణాల్ని వ్రాతపూర్వకంగా కూడా వివరిస్తూ సెజ్‌ల డెవలప్‌మెంట్ కమిషనర్ (డీసీ) అనుమతి తీసుకోవాలని కూడా పేర్కొనడం జరిగింది. ఇంకా అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సైతం ఈ కొత్త పని దినాలు కేంద్రం తెలిపింది.
ఇంకా అలాగే స్పెషల్ ఎకనామిక్స్ జోన్స్ రూల్స్-2006 ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే..కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన విడుదల చేసిన ఈ కొత్త మార్గదర్శకాలతో ఫ్లెక్సిబులిటీ కోరుకునే ఉద్యోగుల్ని ఆకట్టుకునేందుకు దోహదం చేస్తుందని భావిస్తోంది. ఇక ఈ కొత్త పనిదినాలు అనేవి సెజ్ ఉద్యోగులతో పాటు ఐటీ లేదా ఐటీఈఎస్ రంగాల్లో విధులు నిర్వహించే వారికి సైతం ఈ కొత్త పని విధానం అనేది వర్తిస్తుంది. అంటే ఇక కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించలేని ఉద్యోగులకు ఇంకా అలాగే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి పనిచేసే వారికి, అలాగే ఆఫ్‌సైట్‌లో వర్క్ చేస్తున్న ఉద్యోగులకు కూడా ఇంటి వద్ద నుంచి పని చేసుకోవచ్చు. కాగా, ఇప్పటికే వర్క్ ఫ్రం హోం చేస్తున్న సెజ్ యూనిట్లకు సంబంధించిన ఉద్యోగులకు ఈ కొత్త మార్గదర్శకాలు అమలు చేసేందుకు మొత్తం కూడా 90 రోజుల సమయం ఇచ్చింది.