నవోదయ కాదు.. ఏపీలో ఇక సర్వోదయ స్కూల్స్..

Deekshitha Reddy
ఏపీలో ప్రస్తుతం నవోదయ స్కూల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా సర్వోదయ స్కూల్స్ కూడా రాబోతున్నాయి. ఢిల్లీలో ఇప్పటికే ఈ సర్వోదయ స్కూల్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు వీటిని ఏపీలో కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఉన్న స్కూల్స్ లోనే సర్వోదయ తరహా విద్యా విధానం అందుబాటులోకి వస్తుంది.
ఏంటీ సర్వోదయ..?
ఎల్ కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్ లో విద్యను బోధించడమే సర్వోదయ కాన్సెప్ట్. ఒకే పాఠశాల క్యాంపస్ లో పీపీఈ-1, పీపీఈ-2 నుంచి 10+2 వరకు బోధన ప్రారంభించడానికి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి. ప్రస్తుతం ఇది ఢిల్లీలో బాగా సక్సెస్ అయింది. ఏపీ ప్రభుత్వం కూడా ఢిల్లీ తరహాలో సర్వోదయ బోధనా పద్ధతులను తీసుకురాబోతోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను, అధునాతన బోధనా పద్ధతుల ద్వారా అందించాలనే లక్ష్యంతో ఢిల్లీ లోని స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, సర్వోదయ స్కూల్ తరహాలో ఏపీలో కూడా స్కూల్స్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. మొదటగా విజయవాడలోని పొట్టి శ్రీరాములు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్, వీఎంఆర్ హైస్కూల్ ఈ సర్వోదయ కాన్సెప్ట్ కోసం ఎంపిక చేశారు.
ముందుగా ఈ రెండు పాఠశాలలను సర్వోదయ పాఠశాలలుగా మార్చే అవకాశాలున్నాయి. దీనికోసం ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌, నాడు-నేడు ఇన్‌ ఫ్రా జాయింట్‌ డైరెక్టర్‌ మురళి, విజయవాడ నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌.. వీరంతా కలసి స్కూల్స్ ని పర్యవేక్షించారు. దీనితోపాటు.. నగరంలో ఉన్న పొట్టి శ్రీరాములు నగరపాలక సంస్థ హైస్కూల్ స్పోర్ట్స్ డెవలప్‌ మెంట్ సెంటర్‌ ను స్పోర్ట్స్ స్కూల్‌గా మార్చబోతున్నారు. దీనికోసం సన్నాహాలు ముమ్మరం అయ్యాయి.
సర్వోదయ తరహా బోధనతో విజయవాడలోని పాఠశాలల్లో బోధన మెరుగుపడుతుందని అంటున్నారు అధికారులు. దీనికోసం ఓ బృందం ఢిల్లీ వెళ్లి అధ్యయనం చేసి వస్తుంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ఢిల్లీ వెళ్లిన సందర్భంలో అక్కడి సర్వోదయ కాన్సెప్ట్ ని చూసి వచ్చారు. తమ తమ రాష్ట్రాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి విజయవాడలో కూడా ప్రయోగాత్మకంగా సర్వోదయ కాన్సెప్ట్ అమలులోకి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: