అమరావతి : త్యాగాలే చంద్రబాబును ముంచేస్తాయా ?

Vijaya



త్యాగాలు చేయాలి..త్యాగాలకు సిద్ధపడాలి..త్యాగాలకు రెడీగా ఉండాలి..ఇపుడీ విషయంపైనే పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఒంగోలులో ముగిసిన మహానాడు వేదికపైనుండి చంద్రబాబు మాట్లాడుతు వచ్చే ఎన్నికలకు సంబంధించి నేతలు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు. ఇక్కడే సమస్య మొదలైంది. అదేమిటంటే త్యగాలకు సిద్ధంగా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో పోటీకి టికెట్లు దక్కేది అనుమానమే అనే విషయం సీనియర్లకు అర్ధమైపోయింది.





సీనియర్లలో ఎంతమందికి టికెట్లు దక్కుతాయో తెలీదు. మొత్తంమీద బ్లాంకెట్ గా యువతకు 40 శాతం టికెట్లు కేటాయించబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అయితే ఆ టికెట్లు ఏ నియోజకవర్గాలు, ఏ జిల్లాల్లో ఉంటాయనే విషయం పార్టీ అధినేతకు తప్ప మరొకరికి తెలిసే అవకాశంలేదు. షెడ్యూల్ ఎన్నికలేమో రెండేళ్ళలోపు వచ్చేసింది. మరీ సమయంలో వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఇప్పటినుండే కష్టపడక తప్పదు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు హఠాత్తుగా త్యాగాలకు సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు.





దాంతో సీనియర్లలో చాలామంది పోటీ విషయంలో వెనక్కు తగ్గుతున్నారు. ఇక్కడ సీనియర్ల దృష్టిలో మూడు సమస్యలున్నాయి. మొదటిదేమో టీడీపీతో జనసేన-బీజేపీల్లో దేంతో పొత్తుంటుందో తెలీదు. పొత్తులుంటే కొందరికి పోటీచేసే అవకాశం ఎలాగూ రాదు. రెండో సమస్య ఏమిటంటే యువతకు 40 శాతం టికెట్లు నిజంగా ఇచ్చేట్లయితే సీనియర్లలో 40 శాతం టికెట్లలో కోతపడటం ఖాయం. మూడో సమస్యేమిటంటే టికెట్ దక్కేవిషయంలో ఇంత అయోమయం ఉన్నపుడు డబ్బులు ఖర్చుపెట్టుకోవటం ఎందుకని డిసైడ్ అయిపోయారు.





సో పార్టీలో జరుగుతున్న చర్చ చూస్తుంటే ఈ త్యాగాలే టీడీపీ కొంప ముంచేస్తాయేమో అనే అనుమానం పెరిగిపోతోంది. ఇదంతా ఎందుకు జరుగుతోందంటే చంద్రబాబులోని అయోమయం కారణంగానే అని చెప్పాలి. ఒకవైపు పొత్తలంటారు, మరోవైపు యువతకు 40 శాతం టికెట్లంటారు. ఇందుకనే సీనియర్లలో బాగా అయోమయం పెరిగిపోతోంది. అందుకనే త్యాగాలే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పుట్టిముంచటం ఖాయమని చర్చలు పెరిగిపోతున్నాయి. తాను కన్ఫ్యూజ్ అవ్వటమే కాకుండా నేతలందరినీ కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తున్నారు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: