అమరావతి : ఏపీ బీజేపీ నేతలంటే ఇంత మంటుందా ?

Vijaya



‘నా సంబంధాలన్నీ ఢిల్లీ బీజేపీ నేతలతోనే..నాకు ఏపీ బీజేపీ నేతలతో ఎలాంటి సంబంధంలేదు’..ఇవి తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు. పార్టీ విస్తృతస్ధాయి సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతు పై వ్యాఖ్యలు చేశారు. దీన్నిబట్టే పవన్ కు ఏపీ బీజేపీ నేతలంటే ఎంత చులకనగా ఉందో అర్ధమైపోతోంది. నిజానికి బీజేపీ నేతలను పవన్ ఏనాడు పట్టించుకోలేదు.






అయినా తామే బాగా తగ్గి పవన్ కు మద్దతుగా మాట్లాడుతుంటారు. రాష్ట్రంలోని నేతలతో తనకు ఎలాంటి సంబంధంలేదు తన సంబంధాలంటే ఢిల్లీలోని నేతలతోనే అని పవన్ అనటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఏపీలో బీజేపీ వేరు, ఢిల్లీలో బీజేపీ వేరుకాదు కదా. ఏపీకి సంబంధించి ఏదన్నా నిర్ణయం తీసుకోవాలంటే ఏపీ బీజేపీ నేతలతో మాట్లాడిన తర్వాతే కనీసం అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే బీజేపీ అగ్రనేతలు ఏ విషయాన్నైనా డిసైడ్ చేశారు.





అందరికీ తెలిసిన ఇంతచిన్న విషయం పవన్ కు తెలీకుండా ఉండదని అనుకునేందుకు లేదు. తెలిసి కూడా ఏపీలోని కమలనాదులను ఇంత చీపుగా లెక్కేయటమే విచిత్రంగా ఉంది. ఏపీ బీజేపీ నేతలతో తనకు సంబంధంలేదన్న వ్యాఖ్యల వెనుక ఒక విషయం ఉండుంటుంది. అదేమిటంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడుతో పొత్తుపెట్టుకోవాలని పవన్ కు బలంగా ఉంది. దాన్ని బీజేపీ చీఫ్ సోమువీర్రాజుతో పాటు చాలామంది వ్యతిరేకిస్తున్నారు. దీంతో పవన్ కు బాగా మండుతున్నట్లుంది.






అందుకనే ఢిల్లీ నేతలతో చంద్రబాబును కూడా పొత్తుల్లోకి తీసుకోవాలనే ప్రతిపాదన చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ చంద్రబాబుతో పొత్తును ఢిల్లీ నేతలతోనే డైరెక్టుగా మాట్లాడి ఒప్పించవచ్చని పవన్ అనుకుంటున్నారేమో. అందుకనే ఏపీ నేతలను అవమానించారు. ఏపీ నేతలతో తనకు సంబంధాలు లేదంటే అది లోకల్ లీడర్లను తీవ్రంగా అవమానించటమే. మొదటినుండి ఢిల్లీలోని సునీల్ ధియోధర్ తో పవన్ మంచి సంబంధాలు మైన్ టైన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విచిత్రం ఏమిటంటే పవన్ను  నరేంద్రమోడి, అమిత్ షా ఏమాత్రం దేకటంలేదు. మరి మనసులో ఏమి పెట్టుకుని తాజా వ్యాఖ్యలు చేశారో అర్ధం కావటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: