తాలిబన్లతో భారత్ చర్చలు.. దేని కోసమో తెలుసా?
ఎవరైనా ఎదురు తిరిగితే అందరిని దారుణం గా కాల్చి చంపిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ప్రజాస్వామ్యాన్ని మంట కలుపుతూ తాలిబన్లు అధికారాన్ని చేపట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసే పాలన సాగిస్తున్న నాటి నుంచి ప్రపంచ దేశాలు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకొన్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే అక్కడి నుంచి ఎగుమతులు దిగుమతులు పూర్తిగా నిషేధం విధించాయి. ఇలాంటి సమయం లోనే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి రోజు రోజుకు అధ్వానం గా మారి పోతున్నాయి కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి
అయితే మొదటి నుంచి ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ ల విషయం లో సైలెంట్ గానే ఉన్న భారత్ ఇటీవల తాలిబన్లతో చర్చలు జరపడం మాత్రం సంచలనంగా మారి పోయింది అని చెప్పాలి. మొదటి సారి భారత విదేశాంగ బృందం తాలిబన్లతో భేటీ అయింది. భారత్ అందించిన మానవతా సహాయ నగర ప్రజలకు ఏ మేరకు అందుతుంది అనే విషయం పై చర్చించారు. ఈ క్రమం లోనే అటు భారత్ చేపట్టిన ప్రాజెక్టులు దౌత్యపరమైన కార్య కలాపాలను తిరిగి ప్రారంభించాలని తాలిబన్లు భారత్కు విజ్ఞప్తి చేయడం గమనార్హం. తమ దేశం లో విద్యార్థులు రోగులకు సేవలు అందించాలని తాలిబన్లు కోరారు.