వైసీపీ శ్రేణుల్లో మొదలైన టెన్షన్... అధికారం కోల్పోతుందా?

VAMSI
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాలు ఉండగానే అప్పుడే దీని గురించి భారీగా చర్చలు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో జగన్ పార్టీపైన ఎంతో నమ్మకంతో భారీ మెజారిటీతో చరిత్రలో గుర్తుండిపోయే విజయాన్ని ఇచ్చారు తెలుగు ప్రజలు. అయితే రాబోయే ఎన్నికలు మాత్రం అంత సులభంగా ఉండబోవని ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు బట్టి తెలుస్తోంది. ఇప్పటికే విపక్షాలు అన్నీ కలిసి వైసీపీ ని గద్దె దించడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా టీడీపీ ఇటీవలే మహానాడు కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఇక మరో వైపు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా వరుస పర్యటనలు చేస్తూ వైసీపీ పాలన పై వ్యతిరేకతను పెంచుతూ ప్రజల్లో పార్టీకి ఆదరణ పెంచుతున్నారు.

అయితే కొందరు సీనియర్ రాజకీయ నాయకులు భావిస్తున్న ప్రకారం ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే ప్రమాదం లేకపోలేదు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అలా జరిగితే ఏ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటూ ఒక సర్వే ను చేసింది ప్రముఖ ఎన్నికల సర్వే విభాగం శ్రీఆత్మసాక్షి. దీనిని బట్టి ఏ పార్టీకి ఎంత వరకు బలం లేదా బలహీనతలు ఉన్నాయి అన్నది చూద్దాం.

ఈసారి ఎన్నికలు ముందస్తుగా వచ్చినా లేదా 2024 లో వచ్చిన ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీనే గెలుస్తుంది అని ఈ సర్వే తెలుపుతోంది. కానీ.. ఓట్ల శాతం మాత్రం తగ్గుతుందని జగన్ కు షాక్ ఇచ్చింది. అయితే ఈ సర్వే వైసీపీ శ్రేణులను సంతోషపరిచినా... ఓట్ల శాతం తగ్గడం అన్న విషయాన్ని జీర్ణించుకోలేరు అని తెలుస్తోంది. ఒకవేళ అటూ ఇటు అయినా ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం లేకపోలేదు. అందుకే ఇప్పుడు వైసీపీ జాగ్రత్తగా అడుగులు వేయాలి. మరి జగన్సర్వే ను దృష్టిలో పెట్టుకుని ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటాడా అన్నది ఎదురుచూడాలి.

ఇక టీడీపీ కి మరోసారి ఓటమి తప్పకపోయినా, గతంలో కన్నా ఈసారి ఓట్ల శాతం మాత్రం పెంచుకోబోతుండడం సంతృప్తి పరిచే అంశం. అయితే టీడీపీ గెలుపు అంచుదాకా వెళ్లి ఓటమి చెందుతుందని తెలుస్తోంది. కానీ ఇప్పుడు మహానాడు మరియు మిగిలిన కొన్న ప్రయత్నాలు చేసి ప్రజలకు దగ్గరైతే ఫలితం అటు ఇటు అవుతుంది.

ఇక ఏపీలో కీలకంగా మారుతున్న జనసేన మాత్రం గతంలో కన్నా కొంచెం బలపడుతుందని.. ఓట్ల శాతం పెరుగుతుందని తెలుస్తోంది. అయితే టీడీపీ మరియు జనసేనలు కలిసి పోటీ చేస్తే వైసీపీకి ఓటమి తప్పదని శ్రీఆత్మసాక్షి సర్వే తెలిపింది.

అయితే ఇది జరిగితే టీడీపీ-జనసేన సంయుక్తంగా అధికారంలోకి వస్తుంది. ఇది నిజం అయితే వైసీపీ పరిస్థితి ఏమిటి అన్నది ప్రస్తుతం సమస్య ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: