ధరలు పెరుదలతో సామాన్యుడికి చాలా భారంగా మారుతోంది. ఒక వైపు నిత్యవసరాల సరుకుల ధరలతో పాటు అన్నింటి ధరలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తంటి కల సాకారం చేసుకునే వారికి చాలా తీవ్ర ప్రభావం పడనుంది.ఇక ఇప్పుడు మళ్లీ సిమెంట్ ధరలు కూడా పెరగనున్నాయి. ప్రముఖ సిమెంట్ కంపెనీలు ఇండియా సిమెంట్స్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జూలై నెల నుంచి ఆయా కంపెనీలు విడత వారిగా ధరలు పెంచేందుకు అవి సిద్ధమవుతున్నాయి. ధరలు రూ. 55 మేర పెరగనున్నట్లు సమాచారం తెలుస్తుంది. ముడి పదార్థాల ధరలు కూడా పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయాలు పైకి చేరడం వల్ల ధరల పెంచాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంటోంది. జూన్ 1 వ తేదీ నుంచి సిమెంట్ బస్తా రేటు రూ. 20 పెరుగుతుందని కంపెనీలు చెబుతున్నాయి. అలాగే జూలై నెల 1 నుంచి సిమెంట్ రేటు రూ. 20 పెరుగుతుందని ఆ కంపెనీలు చెబుతున్నాయి. ఇలా మొత్తంగా సిమెంట్ బస్తా రేటు వచ్చేసి రూ. 55 మేర పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీని వల్ల కొత్త ఇల్లు కట్టుకునే వారికి చాలా తీప్ర భావం పడనుంది.
కాగా ధరల పెంపు వల్ల సిమెంట్ అమ్మకాలపై కూడా బాగా ప్రభావం పడే అవకాశం ఉంది.ఇక ఇండియా సిమెంట్ తాజాగా ఆర్థిక ఫలితాలు కూడా వెల్లడించింది. ఈ 2021-22 ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికంలో కంపెనీ నష్టాలు రూ.230 కోట్లకుపైగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో మొత్తం రూ.71.6 కోట్ల లాభాన్ని నమోదు చేసినట్లు ఫలితాలు వెల్లడించాయి. అలాగే అదే టైమ్‌లో కంపెనీ ఆదాయం కూడా 4 శాతం క్షీణించింది. ఇక రూ. 1449 కోట్ల నుంచి రూ. 1391 కోట్లకు క్షీణించింది.అలాగే కంపెనీ వ్యయాలు 2.5 శాతం దాకా పెరిగాయి. మొత్తం రూ. 1459 కోట్లుగా ఉన్నాయి. ఈ కారణంగానే ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇక దక్షిణ భారత దేశంలో ఇండియా సిమెంట్ అతిపెద్ద సిమెంట్ తయారీ కంపెనీగా కొనసాగుతోంది.