తెలంగాణ : మంకీపాక్స్ పై అలెర్ట్!

Purushottham Vinay
ప్రపంచంలోని మొత్తం 12 దేశాల్లో వ్యాపించిన మంకీ పాక్స్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం అధికారుల ఇచ్చిన సూచనల ప్రకారం జిల్లా వైద్యాధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు.ఇక రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో మంకీపాక్స్ కు చికిత్స అందించేందుకు మందులు సిధ్దం చేసుకోవాలని.. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకోవాలని సూచించారు.జ్వరం, తీవ్రమైన దద్దుర్లు ఇంకా చర్మంపై బుడగలు వంటివి ఏర్పడటం దీనికి లక్షణాలు. అలాగే అకస్మాత్తుగా తీవ్రమైన దద్దుర్లు వచ్చినవారు, మంకీపాక్స్‌ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి గత 21 రోజుల్లో వచ్చినవారు ఇంకా మంకీపాక్స్‌ సోకినవారితో సన్నిహితంగా మెలిగినవారు ఈ వైరస్ కి అనుమానితులు. ఇక అనుమానిత లక్షణాలు ఉన్నవారిని వెంటనే ఆస్పత్రిలో చేర్చి ఐసొలేషన్‌లో ఉంచాలి. చర్మంపై బుడగలు తొలిగిపోయి ఇంకా పైపొర పూర్తిగా ఊడిపోయి అలాగే కొత్త పొర ఏర్పడే వరకు చికిత్స అందించాలి. ఇది ఇతరులకు సోకకుండా అన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి.ఇక పరీక్షల నిమిత్తం ఉమ్మి, రక్తం ఇంకా రక్తనాళాల్లోని ఇతర ద్రవాల శాంపిళ్లను సేకరించి పూణెలోని ఎన్‌ఐవీకి పంపాల్సి ఉంటుంది. ఈ అనుమానితుల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా నిఘా అధికారి లేదా ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రాం అధికారికి ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి. ఒకవేళ పాజిటివ్‌ కేసు కనుక నమోదైతే కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ చేయాలి.




బాధితులు గత 21 రోజుల్లో ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారో గుర్తించి వారిని వెంటనే ఐసొలేట్‌ చేయాలి.ఇక ఈ మంకీపాక్స్‌ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని ఎన్‌సీడీసీ ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నది. దీని లక్షణాలు 2-4 వారాల్లో తగ్గిపోతాయని తెలిపింది. అరుదైన సందర్భాల్లో మాత్రమే తీవ్రత బాగా పెరుగుతుందని చెప్పింది. మరణాల రేటు కూడా 1-10 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది.ఈ వైరస్‌ జంతువు నుంచి మనిషికి ఇంకా మనిషి నుంచి మనిషికి సోకుతుంది. అలాగే స్వలింగ సంపర్కుల్లో ఈ వ్యాధి ఎక్కువగా సోకుతున్నట్టు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. చర్మం నుంచి వెలువడే ద్రవాలు, తుంపర్లు, కండ్లు, ముక్కు ఇంకా నోటి నుంచి వచ్చే ద్రవాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉన్నది. అలాగే బాధితులు తాకిన వస్తువుల ద్వారా కూడా వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఉన్నది. ఎలుకలు, ఉడుతలు ఇంకా పెంపుడు జంతువుల ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: