గోదావరి : భయం స్పష్టంగా బయటపడిందా ?

Vijaya



వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే విషయంలో చంద్రబాబునాయుడులో భయం స్పష్టంగా బయటపడిందా ? అవుననే సమాధానం వినిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు మాట్లాడుతు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో అందరు కలసిరావాలంటు విజ్ఞప్తిచేశారు. ఇక్కడ పిలుపంటే రెండురకాలుగా అర్ధం చేసుకోవాలి. మొదటిదేమో రాజకీయపార్టీలకు, రెండోదేమో ప్రజలకు.





జగన్ను ఓడించాలంటే తన ఒక్కడివల్లా కాదన్న విషయాన్ని చంద్రబాబు అంగీకరించినట్లే అనిపిస్తోంది. అందుకనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తులకు లవ్ ప్రపోజల్ పంపారు. అలాగే బీజేపీతో పొత్తులకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అందరు కలిసి తనకు అండగా లేకపోతే జగన్ను ఓడించటం తనవల్ల అయ్యేపని కాదన్న విషయం చంద్రబాబుకు బాగా అర్ధమైపోయినట్లుంది. అందుకనే పదే పదే అందరు కలసిరావాలంటు మొత్తుకుంటున్నారు. మరెంతమంది సానుకూలంగా స్పందిస్తారో చూడాలి. 





ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కుర్చీని, పార్టీని లాక్కున్నదగ్గర నుండి ఒంటిరిగా పోటీచేసి గెలిచిన చరిత్రే చంద్రబాబుకు లేదు. 2004లో ఒకసారి 2019లో రెండోసారి టీడీపీ ఎన్నికలకు ఒంటరిగా వెళ్ళి రెండుసార్లు ఓడిపోయింది. వచ్చే ఎన్నికలు చంద్రబాబు రాజకీయ జీవితంలో బహుశా చివరిది కావచ్చు. అందుకనే ఎలాగైనా గెలిచితీరాలని మహాపట్టుదలతో ఉన్నారు. ఇదే సమయంలో ఒంటరిగా పోటీచేస్తే ఏమవుతుందో బాగా తెలుసు.





అందుకనే పొత్తులు పొత్తులంటు నానా అవస్తలు పడుతున్నారు. తాజా పర్యటనలో  అందరు కలసిరావాలని టీడీపీ నాయకత్వం వహిస్తుందన్నారు. అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమంటు ప్రకటించారు. ఎలాంటి త్యాగానికైనా సిద్ధం అంటే ఏమిటో చంద్రబాబు మాత్రమే చెప్పాలి. ఎందుకంటే పొత్తుల్లో గానీ ఇతరత్రా కానీ త్యాగాలు చేసిన చరిత్ర చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. మరి మొదటిసారి త్యాగం అనే పదం వాడారంటే ఆ త్యాగం ఏమిటో, ఏ రూపంలో ఉంటుందో కూడా చంద్రబాబే వివరించాలి. త్యాగమనే పదానికి అర్ధం వివరిస్తే దాదాపు ఇలాంటి మాటలే మాట్లాడుతున్న పవన్ పొత్తులకు సై అంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: