కరోనా ఫోర్త్ వేవ్ వచ్చేసిందా... డాక్టర్లు ఏమి చెప్పారో తెలుసా?

VAMSI
కరోనా తగ్గింది అనుకుంటుంటే ఆ ఆనందం కాసేపు కూడా నిలబెట్టడం లేదు ఈ మహమ్మారి. మళ్ళీ నా టైం స్టార్ట్ అయ్యింది అంటూ విజృంభిస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో గత కొంత కాలంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇక దేశం లోనూ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ విషయంపై వైద్య నిపుణులు ఏమంటున్నారు అంటే...!! మళ్ళీ కరోనా తిరగబెడుతోంది కరోనా ఫోర్త్ వేవ్ ముప్పు తప్పేలా కనిపించడం లేదు అంటున్నారు పలువురు ఆరోగ్య నిపుణులు. గత కొద్ది రోజులుగా దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసుల స్పీడ్ చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ నిత్యం వెయ్యి లోపే కేసులు నమోదు అవుతుండగా ఇపుడు ఆ సంఖ్య కాస్త రెండింతలు పెరిగింది.

నిత్యం దేశంలో మూడువేల వరకు పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతే కాకుండా యాక్టీవ్ కేసుల సంఖ్య కూడా క్రమేణా పెరుగుతుండటం భయపెడుతున్న అంశం.  గడిచిన 24 గంటల్లో దేశంలో 3.27 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా.. అందులో 3 వేల 205 కేసులు  నమోదైయ్యాయి. ముందు రోజుకంటే 32 శాతం కేసులు అధికమయ్యాయి అని హెల్త్ బులిటెన్ డేటా చెబుతోంది.  భారత్‌లో తాజాగా మహమ్మారి నుండి కోలుకుని 2 వేల 802 మంది డిశ్చార్జ్ అయ్యి ఇళ్లకు చేరుకున్నారు. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 98.74 శాతంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.  

ఇక గడిచిన 24 గంటల్లో మొత్తం 31 మంది కరోనా బాధితులు ఈ మాయదారి వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దాంతో దేశంలో  ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,23,920 కి చేరింది.
దేశం లో కరోనా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు అలెర్ట్ అయ్యి నివారణ చర్యలను వేగవంతం చేశాయి. కొన్ని రాష్ట్రాలలో అయితే లాక్ డౌన్ లు కూడా పెట్టాలని ఆధికారులు సూచిస్తున్నారు. ఇక ఎన్ని కేసులు వచ్చినా ఫోర్త్ వెవ్ వచ్చినా భయపడకుండా యుద్ధం చేయడం తపోతే వేరే మార్గం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: