ధరల పై మామిడి రైతులు ఆవేదన..

Satvika
వేసవి కాలం వచ్చింది అంటే మామిడి పండ్లు కూడా విరివిగా లభిస్తాయి.ఈ సీజన్ లో లభించే ఈ పండ్లకు డిమాండ్ కూడా ఎక్కువే..అయితే కొన్ని అనుకూల పరిస్థితులను బట్టి దిగుబడి కూడా ఈ ఏడాది బాగా తగ్గి పోయింది. అందుకు కారణం వాతావరణ పరిస్థితులే కారణమని తెలుస్తుంది.రిటైల్‌గా వాటి రేట్లు మాత్రం అదిరిపోతున్నాయి. ఆరోగ్యానికి మంచి చేసే సీజనల్‌ పండ్ల ధరలకు రెక్కలు వచ్చాయి..డజను కొనాలని అనుకున్న వాళ్ళు ఇప్పుడు అర డజను పండ్లను కొనలెని పరిస్థితి. ఇక సామాన్యులు అయితే మామిడి పండ్లను కొనాలనే ఆలోచనను మానెస్తున్నారు..ధరలు బంగారం కన్నా కూడా విలువ అవుతూన్నాయి.


వేసవి సీజన్ లో మామిడి, బత్తాయి, అరటి, చక్రకేళి, నిమ్మ, బొప్పాయి, సపోట వంటి పండ్ల ఉత్పత్తి బాగా తగ్గిపోయింది..దాంతో వాటి ధరలు చూస్తే గుండెల్లో వణుకు పుడుతుంది.ఈ ఏడాది ప్రతికూల వాతావరణంతో పండ్ల తోటలన్నీ దెబ్బతిని, పంట దిగుబడి గణనీయంగా పడిపోయింది. ఈ కారణంగా పండ్ల ఉత్పత్తులు మార్కెట్‌కు రావడం తగ్గిపోయింది. విచిత్రంగా పండ్ల మార్కెట్లు వెలవెలబోతుంటే..పండ్ల ధరలు మాత్రం భగ్గుమంటున్నాయి.2021 లో కురిసిన అకాల వర్షాల కారణంగా, మరి కొన్ని ప్రతికూల పరిస్థతుల వల్ల దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని రైతులు చెబుతున్నారు.


కృష్ణా, ప్రకాశం, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో అధిక వర్షాలు వ్యవసాయ పంటలను దెబ్బతీశాయి. ఉద్యాన తోటల్నీ గుల్లచేశాయి. ఈ ఏడాది జనవరిలోనూ అక్కడక్కడా వర్షాలు కురిశాయి. మరో వైపు గత రెండు నెలల నుంచి సూర్యుని వేడికి తోటలు కూడా ఎండిపోయాయి.బంగినపల్లి రకం మామిడి ఈ నెలారంభంలో టన్ను రూ.60-80వేలు దాకా పలికింది. నాణ్యమైన పండ్లు రూ.లక్ష వరకు పలికాయి. కానీ ఇప్పుడు నాణ్యమైన పండ్లు కూడా పెద్దగా ధర పలకడం లేదు. 30 వేలు కూడా టన్ను పడటం లేదు అందుకే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వ్యాపారులు మాత్రం ధరలను భారీగా పెంచేసారు.. ఫలం మధురం,ధర మాత్రం అధికం అన్న విధంగా మారింది.ఈ వేసవి లో అన్నీ పండ్లు అలానే ధరలు పెరిగాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: