రాయలసీమ : మానసికంగా దెబ్బ కొట్టడమేనా ?

Vijaya



ప్రత్యర్ధులు లేదా శతృవులపై విజయం సాధించాలంటే రెండు పద్దతులున్నాయి. మొదటిది భౌతికంగా యుద్ధం చేయటం ఒకపద్దతి. ఇక రెండోది మానసికంగా కుంగిపోయేట్లు చేయటం. ఇపుడు ప్రత్యర్ధులైనా శతృవులపై యుద్ధమంటే ఎన్నికల్లో తలపడటం మాత్రమే. కాబట్టి భౌతికంగా యుద్ధమంటు ఉండదు. అందుకనే ఓట్ల ద్వారా విజయం సాధించేందుకు  మానసికంగా దెబ్బకొట్టడానికి ప్రాధాన్యత పెరిగిపోయింది.



ఇపుడు చంద్రబాబునాయుడుపై జగన్మోహన్ రెడ్డి చేస్తున్నదిదే. ఒకపుడు జగన్ పై చంద్రబాబు ఇదే ప్రయోగం చేసి ఫెయిలయ్యారు. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని పదే పదే జగన్ చెప్పటంలో అర్ధమిదే. ఉత్తనే చెప్పటమే కాకుండా అందుకు అవసరమైన అస్త్రాలన్నింటినీ రెడీ చేస్తున్నారు. జగన్ తయారుచేసిన అతిపెద్ద ఆయుధమే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుప్పంలో చంద్రబాబును ఓడించే బాధ్యతను పెద్దిరెడ్డిపైన మోపారు.




దానికి తగ్గట్లే పెద్దిరెడ్డి కూడా క్షేత్రస్ధాయి నుండి పనిచేసి గ్రామ గ్రామాన కష్టపడుతున్నారు. దీని ఫలితం మొన్నటి స్ధానిక సంస్ధల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కనబడింది. మొట్టమొదటిసారిగా 30 ఏళ్ళల్లో అన్నీ ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఊపులోనే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి తీరాలని జగన్ గట్టి పట్టుదలగా ఉన్నారు. ఒకవైపు పెద్దిరెడ్డి, మరోవైపు ఎంఎల్సీ, జిల్లా అధ్యక్షుడు భరత్, ఇంకోవైపు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి విస్తృతంగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబుకు ఏమి చేయాలో తెలీక దిక్కులు చూస్తున్నారు.



సంక్షేమ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయటమే కాకుండా సంవత్సరాల ప్రజల కోరికైన కుప్పంను మున్సిపాలిటిగా మార్చారు. అలాగే కుప్పంను రెవిన్యు డివిజన్ గా మార్చాలని జనాలు ఎప్పటినుండో అడుగుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. అలాంటిది జగన్ వెంటనే చేసేశారు.  ఇలాంటి అనేక కార్యక్రమాలతో జగన్ జనాల్లో చొచ్చుకుపోతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబును ఎంత వీలైతే అంత మానసికంగా దెబ్బతీయటమే జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. మరి తన ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: