బాలుడికి పూర్వజన్మ గుర్తొచ్చింది.. ఏం చేసాడో తెలుసా?

praveen
మనిషికి 7 జన్మలు ఉంటాయి అని చెబుతూ ఉంటారు. ఇక ఒక్కో జన్మలో ఒక్కో రూపంలో పుడుతూ ఉంటారు  అని అంటూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం ఊహించని రీతిలో విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటాయి. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఏకంగా చనిపోయిన వ్యక్తుల లాగానే మాట్లాడటం లాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది చిన్నారులు. ఇక ఇలాంటివి చూసినపుడు చుట్టుపక్కల జనాలు కొంతమంది దెయ్యం పట్టింది అనుకుంటే మరికొంతమంది మాత్రం పూర్వజన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి అని భావిస్తూ ఉంటారు. అప్పట్లో ఇలాంటి తరహా సంఘటనలు తరచూ సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చి సంచలన గా మారిపోయిన విషయం తెలిసిందే.



 ఏకంగా పూర్వజన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి అంటూ ఎంతో మంది చిన్నారులు చిత్రవిచిత్రంగా మాట్లాడటం అప్పట్లో సెన్సేషన్ గా మారిపోయింది. ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక బాలుడు నా పూర్వజన్మ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి పోతాను అని చెప్పి ఇక ప్రస్తుతం తల్లిదండ్రులకు షాక్ ఇచ్చాడు. మీరు నా తల్లిదండ్రులు కాదు అసలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి పోతున్న అంటూ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.  ఈ ఘటన స్థానికంగా అందరినీ అవాక్కయ్యేలా చేసింది. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.


 న్యూ విద్యా నగర్ లో ఉండే దంపతులకు 15, 13 ఏళ్ల ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే పిల్లలు భార్యలను  వదిలి భర్త వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే  పిల్లలు పాఠశాలలకు వెళ్ళకుండా ఇంట్లోనే టీవీలో చరవాణిలో పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. చిన్న కుమారుడు చరవాణిలో ఒక సెల్ఫీ వీడియో రికార్డు చేసాడు. తను పూర్వజన్మలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి పోతున్నానని.. ఆ వీడియోలో చెప్పాడు.  మీరు నా తల్లిదండ్రులు కారు అసలు తల్లిదండ్రుల  దగ్గరికి వెళ్లి పోతున్న అని చెప్పి వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకుండాపోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: