వారెవ్వా.. కాశ్మీర్ ఆర్మీ కొత్త గేమ్?
భారత్ లోకి అక్రమం గా చొరబడిన ఉగ్ర వాదులు అందర్నీ కూడా గుర్తించి మరి స్థావరాలను ధ్వంసం చేయడమే కాదు ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేస్తుంది. భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకుంటూ ఉండటం గమనార్హం. ఇకపోతే భారత ఆర్మీ దూకుడుకు భయపడి ఉగ్రవాదులు అక్కడ తలదాచుకోవాలో కూడా తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పాలి ఇలాంటి సమయంలోనే ఇక ఉగ్రవాదులను మరింత వేగంగా పసిగట్టి ఎన్కౌంటర్ చేసేందుకు అటు భారత ఆర్మీ సరికొత్త వ్యూహనికి తెరలేపింది అనేది తెలుస్తుంది.
కొండ ప్రాంతాల లో నక్కి ఉన్న ఉగ్రవాదుల ఆచూకీని కనుగొనేందుకు ఇటీవలె భారత్ ఆర్మీ డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తుంది అన్నది తెలుస్తుంది. డ్రోన్ కెమెరాల ద్వారా అన్ని ప్రాంతాలలో జల్లెడపట్టి ఉగ్రవాదులను గుర్తిస్తూ ఇక అక్కడికి వేగంగా చేరుకుంటున్న అర్మీ ఎన్కౌంటర్ చేస్తుంది. ఇలాగే డ్రోన్ కెమెరా ద్వారా కొన్ని స్థావరాలను గుర్తించింది. అయితే డ్రోన్ కెమెరాలకు చిక్కకుండా దాక్కోవాల్సిన ఉగ్రవాదులు వేగంగా రాళ్లతో డ్రోన్ కెమెరాలు పై దాడి చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆర్మీ వారిని ఎన్కౌంటర్ చేయడం గమనార్హం. రానున్న రోజుల్లో ఇలాంటి ఎన్కౌంటర్లు చాలానే జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది..