తమ్మినేని రూటే సెపరేటు.. జగన్ ని ఇరికించేశారా..?
బయటపడితే మళ్లీ జగన్ దగ్గరకు వెళ్లాలి, ఆయన బుజ్జగించాలి, ఏదో ఒకటి చెప్పి సర్దిచెబుతారు. 2024లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అందుకే అలాంటి హామీలకు లొంగలేదు తమ్మినేని. తనకు తానే సర్దిచెప్పుకున్నారు. తనకు తానే బుజ్జగించుకున్నారు. ప్రెస్ మీట్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. నాయకుడికి తానెప్పుడూ సమస్య కాబోనని అన్నారు తమ్మినేని. జగన్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, ఆయన ఏ పని అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు తమ్మినేని సీతారాం. తానెప్పుడూ ఎలాంటి పదవులూ ఆశించలేదన్నారు స్పీకర్ తమ్మినేని.
సీఎం ఏ పని అప్పగించినా చేస్తానని చెప్పారు సీతారాం. జనాల్లోకి వెళ్లి పార్టీ కోసం పనిచేయమన్నా నిరభ్యంతరంగా వెళ్తానని చెప్పారు. మంత్రి పదవి విషయంలో కూడా తనదైన శైలిలో స్పందించారాయన. తనకు మంత్రి పదవి వస్తుందని పత్రికలే రాశాయని అన్న సీతారాం.. అసలు తాను మంత్రి పదవే ఆశించలేదని చెప్పుకొచ్చారు. అంతే కాదు, గతంలో స్పీకర్ గా తనకు పదవి ఇచ్చే సందర్భంలో కూడా జగన్ కాస్త ఇబ్బంది పడ్డారని, కానీ తాను మాత్రం ఎలాంటి ఇబ్బందీ లేదని బాధ్యత తీసుకున్నానని చెప్పారు. 2024లో కూడా ఆముదాల వలస నుంచి గెలిచి రికార్డ్ సృష్టిస్తానన్నారు తమ్మినేని.
మొత్తమ్మీద తాను జగన్ వద్దకు వెళ్లకుండానే, తన అసంతృప్తిని బయటపెట్టి పరోక్షంగా తనకు తానే సర్ది చెప్పుకున్నారు తమ్మినేని. మళ్లీ గెలుస్తానని చెప్పారంటే.. కచ్చితంగా 2024లో తనకు బెర్త్ కన్ఫామ్ చేయాల్సిందేనని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్టే. ప్రస్తుతం జగన్ చేస్తున్న పని కూడా అదే. అసంతృప్తితో తన దగ్గరకు వచ్చినవారందరికీ 2024లో మీకే మంత్రి పదవి అని చెప్పి పంపించేస్తున్నారు. తమ్మినేని కూడా తనకు తానే అలా హామీ ఇచ్చుకుని ముందుకు కదిలారు.