మెగాస్టార్ ఆఫర్ : సుప్రీమ్ హీరోకా? మెగా ప్రిన్స్ కా?

frame మెగాస్టార్ ఆఫర్ : సుప్రీమ్ హీరోకా? మెగా ప్రిన్స్ కా?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇతర భాషల సినిమాల్ని రౌండప్ చేసిన సంగతి తెలిసిందే. వరుసగా రీమేక్ లకు ఒకే చెబుతూ కొత్త చిరంజీవిని ఆవిష్కరించే ప్రయత్నం ఆయన చేస్తున్నారు.ఇక ఇప్పటికే మలయాళం సినిమా `లూసీఫర్` ని `గాడ్ ఫాదర్` టైటిల్ తో చిరు రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ ని కూడా ఆయన పూర్తిచేసారు. అలాగే తమిళ సినిమా "వేదాళం" ని `భోళాశంకర్` టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. . ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇక ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది.అలాగే బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. దీంతో పాటు యంగ్ మేకర్ వెంకీ కుడుమల తో కూడా ఓ సినిమా చేస్తున్నట్లు మెగాస్టార్ ఇటీవలే ప్రకటించారు. ఆ ప్రాజెక్ట్ వివరాలనేవి ఇంకా తెలియాల్సి ఉంది. వరుస పెట్టి సినిమాలు ప్రకటించమే కాదు..వాటిని వీలైంనత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా అంతే వేగంగా జరుగుతున్నాయి. అలాగే మలయాళంలో ఇటీవలే విడుదల అయి సంచలన విజయం నమోదు చేసిన `బ్రో డాడి` రీమేక్ లోనూ నటించడానికి మెగాస్టార్ చిరంజీవి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారని ప్రచారం సాగుతోంది.




ప్రస్తుతం అతని ఆధ్వర్యంలో స్ర్కిప్ట్ రీమేక్ పనులు అనేవి జరుగుతున్నాయి. అయితే మేకర్ గా ఇంకా అతను ఇంకా ఫైనల్ కాలేదు. రీమేక్ బాధ్యతలు మాత్రమే అతనికి అప్పగించినట్లు ప్రచారం సాగుతోంది. ఇక స్ర్కిప్ట్ సిద్దమైన తర్వాత దర్శకుడు ఎవరు? అన్నది మెగాస్టార్ ఫైనల్ చేస్తారు. అయితే ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో ముఖ్యమైన పాత్ర కూడా ఉంది.ఇందులో ఓ యంగ్ హీరో మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా నటించాల్సి ఉంది. ఈనేపథ్యంలో ఆ పాత్ర కోసం సాయిధరమ్ ఇంకా వరుణ్ తేజ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా ఎవర్నీ కూడా ఫైనల్ చేయలేదు. చిరంజీవి కోరిక మేరకు ఆ నిర్ణయం అనేది జరుగుతుంది. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది.ఇక ఏప్రిల్ 29 వ తేదీన చిరంజీవి నటించిన `ఆచార్య` సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా మరికొన్ని రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రమోషన్ పనుల్లో బిజీ అవుతారు. ఇక ఆ సినిమా రిలీజ్ తరువాత సెట్స్ లో ఉన్న బ్యాలెన్స్ సినిమా షూటింగ్ లు కూడా పూర్తి చేస్తారు. అటుపై `బ్రోడాడి` పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: