అమరావతి : చెల్లెలికి షాకిచ్చిన జగన్..నో అపాయిట్మెంట్

Vijaya



చెల్లెలు..చెల్లెలు అని జగన్మోహన్ రెడ్డి నెత్తిన పెట్టుకున్నందుకు మాజీమంత్రి మేకతోటి సుచరిత తన అసలు రూపాన్ని బయటపెట్టుకున్నారు. మూడేళ్ళ క్రితం మంత్రివర్గం ఏర్పడినపుడు మేకతోటికి జగన్ హోంశాఖను అప్పగించారు. హోంశాఖను అప్పగించటమంటే ఎంతో నమ్మకం ఉన్నవారికి మాత్రమే కేటాయిస్తారు. అలాంటి మంత్రిపదవిలో మూడేళ్ళున్న మేకతోటి తాజాగా తన అసలు రూపాన్ని బయటపెట్టారు.





మేకతోటి వైఖరికి ఆశ్చర్యపోయిన జగన్ ఆమెకు ఇపుడు అపాయిట్మెంట్ కూడా ఇవ్వటంలేదట. తాజాగా జగన్ క్యాబినెట్-2 నేపధ్యంలో మేకతోటికి మంత్రిపదవి రెన్యువల్ కాలేదు. దాంతో ఆమెకు ఎక్కడలేని కోపమొచ్చేసింది. జగన్ పైన మేకతోటికి కోపం రావటానికి మూడు కారణాలున్నాయట. మొదటిదేమో తనను మంత్రిపదవిలో నుండి తొలగించిన విధానం. రెండోదేమో తన సహచర ఎస్సీలు నలుగురికి మంత్రివర్గంలో చోటిచ్చి తనకు మాత్రం ఇవ్వకపోవటం. మూడో కారణం ఏమిటంటే అలిగిన తనను బుజ్జగించటానికి కీలక వ్యక్తులను పంపకపోవటం.





నిజానికి మూడు కారణాలు కూడా మేకతోటికి సెట్ కావు. ఎందుకంటే మంత్రివర్గంలోకి తీసుకున్నా, పక్కనపెట్టినా అనేక కాంబినేషన్లను పరిశీలించిన తర్వాత మాత్రమే జగన్ ఫైనల్ జాబితాను తయారుచేసుకునుటారు. మంత్రివర్గంలో తనపేరు లేనపుడు మేకతోటి కాస్త హుందాగా ఉండాల్సింది. క్యాబినెట్లో చోటు కోల్పోయిన కొడాలి, పేర్ని, కన్నబాబు, పుష్పశ్రీవాణి అలిగి ఎక్కడా రచ్చ చేయలేదే ? మూడేళ్ళు మంత్రివర్గంలో కీలకమైన శాఖ ఇచ్చి చివరి రెండేళ్ళు పక్కన పెట్టడాన్ని మేకతోటి సహించలేకపోతున్నారు. అందుకే అలిగి నానా రచ్చ చేశారు. తాను ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసినట్లు తన పిల్లలతో మేకతోటి చెప్పించి బాగా హీట్ పెంచేశారు.




ఇదంతా చూసిన జగన్ కు బాగా మండిపోయింది. ఏదన్నా అసంతృప్తి ఉన్నా నేరుగా తనతోనే చెప్పుకునే అవకాశం ఉన్నప్పటికీ మీడియా ముందు రచ్చ చేయటాన్ని జగన్ సహించలేకపోయారు. అందుకనే రెండురోజులుగా అపాయిట్మెంట్ అడుతున్నా జగన్ పట్టించుకోలేదట. అసంతృప్తులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కరణం ధర్మశ్రీ, సామినేని ఉదయభానును తన దగ్గరకు పిలిపించుకుని మాట్లాడిన జగన్ మేకతోటిని మాత్రం పట్టించుకోలేదు.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: