మాజీ హోమ్ మంత్రి ఎమ్మెల్యే పదవికి రాజీనామా ?

VAMSI
జగన్ మార్క్ మరోసారి చూపించాడు. ఏపీ రాజకీయాల్లో మొదటి నుండి జగన తనదైన ఆసక్తికర నిర్ణయాలతో అటు ప్రత్యర్థులకు ఇటు సొంత పార్టీ నేతలకు షాక్ ఇస్తూనే ఉన్నాడు. 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకుని తొలిసారి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడే మంత్రి వర్గం కూర్పు సమయంలో యువకుడు అయిన జగన్ ఏ విధంగా అందరినీ ఆకట్టుకుంటాడు అని అంతా అనుకున్న తరుణంలో మంత్రి వర్గాన్ని రెండు సార్లు చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అందులో భాగంగా గత రెండు రోజుల నుండి నూతన మంత్రి వర్గ కూర్పు విషయం పెద్ద చర్చగా మారింది. ఇప్పటికే మంత్రులయ్యే వారి పేర్లను ప్రకటించారు జగన్. అయితే పాత మంత్రులలో 11 మందిని కొనసాగించి మిగిలిన వారందరికీ మొండి చేయి చూపింది.

అలాంటి వారిలో మాజీ హోమ్ మంత్రి మేకతోటి సుచరిత ఒకరు. జగన్ పాత కాబినెట్ లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సుచరితను హోమ్ మినిస్టర్ చేశారు. కానీ ఈ రెండున్నరేళ్ల కాలంలో ఒక కీలక మంత్రిగా తానేమిటో నిరూపించుకోవడంలో దారుణంగా విఫలం అయిందని కొన్ని వార్తా పత్రికలు పుంఖానుపుంఖాలుగా రాసిన మాట వాస్తవమే. అయితే సుచరిత మాత్రం రెండవ సారి కూడా మంత్రి అవుతుందని ఎంతో ఆశ పెట్టుకుంది. అయితే నిన్న ప్రకటించిన నూతన మంత్రి వర్గంలో తన పేరు లేకపోవడంతో తీవ్రంగా నిరాశకు లోనయింది.

అయితే నిన్నటి నుండి ఈమె తన నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో వరుస సమావేశాలు చేస్తున్నారు. అయితే ఈమె వర్గీయుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మేకతోటి సుచరిత ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజీనామా చేసినా కూడా ఈమె వైసీపీ లోనే కొనసాగనుందని ఇప్పటి వరకు తెలుస్తున్న సమాచారం. ప్రస్తుతం వరకు అయితే రాజీనామా గురించి ఎటువంటి వార్త లేదు. మరి ఇది జరిగితే జగన్ కు బిగ్ షాక్ అని చెప్పాలి. అయితే ఇది ఇంకెంతమంది నాయకులను కదిలిస్తుందో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: