కరెంట్ కోతలపై నారా లోకేష్ ధ్వజం...

VAMSI
ఆంధ్ర ప్రదేశ్ లో రోజు రోజుకీ సమస్యలు ఎక్కువ అయిపోతున్నాయి. ఇప్పటికే పెరిగి పోయిన నిత్యావసరాల ధరలతో సతమతం అవుతుంటే ఇప్పుడు మరొక కొత్త సమస్య వచ్చి పడింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ధరలను రీసెంటుగా పెంచిన కారణంగా ప్రతిపక్ష పార్టీలు అధికార వైసీపీ పై దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇకపై రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మరీ దారుణంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఒక రోజులో కనీసం ఎటు కాదనా 6 గంటలు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండబోతోందట. ఈ విషంపైన తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారా లోకేష్ నిరసనను తెలియచేస్తున్నారు.

టిడిపి నేత లోకేష్  లాంతరు చేత పట్టుకుని తన కార్యకర్తలతో కలిసి విద్యుత్ కోతల పట్ల ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటనలో ఉన్న సమయంలో కరెంట్ పోయి గంటల కొద్దీ రాక పోవడంతో ఆయన తన పార్టీ నాయకులతో కలసి లాంతర్లు, కొవ్వుత్తులు చేత పట్టుకుని  వీదుల్లో తిరిగారు. అంతే కాదు కరెంట్ బాదుడే బాదుడు అని ముద్రించి ఉన్న విశన కర్రలను ప్రజలకు పంచి పెట్టారు. ఇప్పటికీ అధికార పార్టీ వచ్చాక ఏడు సార్లు విద్యుత్ చార్జీలను పెంచింది. ఇపుడు అదనంగా కరెంట్ కోతలతో బంపర్ ఆఫరే ఇస్తోంది అంటూ ప్రభుత్వం పై మండి పడ్డారు. ఇలా ప్రజలపై అన్యాయంగా కరెంటు కష్టాలు మోపడం దారుణమని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు లోకేష్.

మరి ఈ కరెంటు కోతలు, అదనపు చార్జీల భారం ఇంకెంత కాలం మోయాలి అని సామాన్య ప్రజానీకం కన్నీరు మున్నీరవుతున్నారు. ముఖ్యంగా గ్రామాలలో కూడా కరెంటు లేకపోతే ఎన్ని కష్టాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కరెంటు కోతలు అంటే ఇది ఖచ్చితంగా వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: