భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు.. ఈ రోజు మళ్ళీ పెరిగింది?

praveen
సార్ ఇక మీరు మారరా.. ఒకవైపు మేము ఆపండి మహాప్రభో అంటూ లబోదిబోమంటూ మొత్తుకుంటుంటే  మీరేమో మీరు చేయాల్సిన పనులు చేస్తున్నారు... ఇలా అయితే ఎలా సార్.. ఓట్లు వేసే మేము మీకు అక్కర్లేదా.. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ప్రభుత్వాలను ఇలాగే ప్రశ్నిస్తున్నారు. కారణం పెట్రోల్ ధరల పెరుగుదల. దాదాపు రెండు వారాల ముందు వరకు అటు పెట్రోల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బారెల్ ధరలు పెరిగినప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం మాత్రం పెట్రోల్ ధరలు పెంచలేదు. కానీ ఇప్పుడు దాదాపు రెండు వారాల నుంచి ప్రతిరోజు క్రమక్రమంగా పెట్రోల్ ధరలు పెరుగుతూనే వస్తూ ఉన్నాయి.



 అయితే ప్రతిరోజూ పెరుగుతుంది కేవలం పైసల్లో మాత్రమే అయినప్పటికీ ఇక ఇప్పటి వరకూ రెండు వారాల్లో పెరిగింది మాత్రం పది రూపాయలకు పైగానే అన్నది తెలుస్తుంది. తేనె పూసిన కత్తి తో పొడిచినట్లు గానే ఒక్కసారిగా  పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇక పైసల్లో పెంచుతూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఏది ఏమైనా నేటి రోజుల్లో ప్రజలపై మరింత భారం పడుతోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పెట్రోల్ ధరల పెరుగుదల ఆపండి మహాప్రభో అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలు ఎంత వేడుకున్నా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు అని చెప్పాలి.



 ఇక గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్ ధరలు  నేడు కూడా పెరిగిపోయాయి. పెట్రోల్ పై 90 పైసలు ఒక లీటర్ డీజిల్ పై 87 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక ఇలా పెరిగిన ధరలతో పెట్రోల్ ధరలు చూసుకుంటే హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర 119.49 కి చేరింది. ఇక డీజిల్ ధర 105.49 చేరడం గమనార్హం. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర 121.35 కు చేరింది. డీజిల్ ధర  107.03కూ చేరింది. ఇలా పెరిగిన ధరలతో సామాన్య ప్రజలందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: