వామ్మో.. తెలంగాణలో 90 వేల పెళ్లిళ్లు?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం. అందుకే ప్రతి ఒక్కరూ మంచి సమయం ముహూర్తం చూసి అంగరంగవైభవంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులు బంధు మిత్రులు శ్రేయోభిలాషులు అందరి సమక్షంలో పెళ్లి చేసుకొని అందరి ఆశీర్వచనాలు తీసుకోవాలని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతో మంది యువత ఇక ఇప్పుడు పెళ్లికి సిద్దం అయ్యారు అని తెలుస్తోంది.



మరి కొన్ని రోజుల్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి.. ఎంతో మంది యువతీ యువకులు పెళ్లితో ఒక్కటవ్వబోతున్నారు. కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇక ఎన్నో కుటుంబాలు తమ పిల్లలకు పెళ్లి చేసేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నాయ్. ఈ క్రమంలోనే ఇక అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని  కొత్త జీవితాన్ని ఆస్వాదించటానికి సిద్ధమైపోతున్నారు ఎంతోమంది. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో పెళ్లి ముహూర్తాలు రాబోతున్నాయి. ఏప్రిల్ నెల ముగియగానే మే 25వ తేదీ నుంచి మంచి ముహూర్తాలు రాబోతున్నాయి.


 ఇక ఈ మంచి ముహూర్తాలలో పెళ్లి చేసుకోవాలని ఎంతో మంది యువతీ యువకులు భావిస్తున్నారు. ఇక చాలా కుటుంబాలు కూడా ఈ ముహూర్తాలలో పెళ్లిళ్లు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇక అటు తెలంగాణ రాష్ట్రంలో ఇక ఈ పెళ్లి ముహూర్తాలలో రికార్డు స్థాయిలో వివాహాలు జరగబోతున్నాయి అనేది తెలుస్తుంది. కేవలం ఒక్క భాగ్యనగరం లోనే 35 వేలకు పైగా వివాహాలు జరుగుతూ ఉండటం గమనార్హం. అంతేకాదు ఇక తెలంగాణ వ్యాప్తంగా ఏప్రిల్-మే నెలల్లో దాదాపు 90 వేల జంటలు కొత్త జీవితంలోకి అడుగు బోతున్నాయి.


 ఈ క్రమంలోనే ఇక ఈ పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరుపుకునేవారు ఇప్పటికే ఫంక్షన్ హాల్ హోటల్స్ బుకింగులు కూడా శరవేగంగా జరుగుతున్నాయ్ అని తెలుస్తోంది. భారీ రేంజ్ లో పెళ్లిళ్లు జరుగుతూ ఉండడంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉందని తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: