ఏపీ సర్కార్ పై జనసేన సంచలన వ్యాఖ్యలు ?
ప్రభుత్వం నుండి నెల రోజుల్లో స్పందన రాకపోతే జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా కలుసుకుని బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. రైతు స్వరాజ్య వేదిక అందించిన రిపోర్ట్ మేరకు కౌలు రైతుల కష్టాలపై జనసేన ఆందోళన అన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు న్యాయం జరిగేలా ఉధ్యమం అని..
నాడు ఫ్యాన్ కు సంతోషంగా ఓటు వేస్తే నేడు ఫ్యాన్ వేస్తే షాక్ కొడుతుందని ఫైర్ అయ్యారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. త్వరలో విద్యుత్ ఛార్జీలు పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఆందోళన అన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. చెత్త పన్నుతో వేధిస్తూ మళ్ళీ పేదవాడిపై విద్యుత్ ఛార్జ్ లు భారం బాధకరమని.. పెంచిన విద్యుత్ ఛార్జ్ లు ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రజలతో కలిసి జనసేన ఉద్యమం అన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.