చైనా ని అల్లాడిస్తున్న కరోనా భూతం... షాంఘై లో లాక్ డౌన్ ?

VAMSI
కోవిడ్ 19 పుట్టినిల్లు చైనాలో మళ్ళీ వైరస్ రంకెలు వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కొత్త కేసులు తగ్గు ముఖం పడుతూ తిరిగి ప్రశాంత వాతావరణం నెలకొంటున్న సమయంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం కరోనా విలయతాండవం కొనసాగిస్తోంది. ముఖ్యంగా తన పుట్టినిల్లు అయిన చైనా లో కేసులు కుప్పలు తిప్పలుగా పెరిగి పోతున్నాయి. దాంతో అక్కడి అధికారులు పరిస్థితులను మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావడానికి వైరస్ ను కట్టడి చేయడానికి లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా డ్రాగన్ దేశంలో 6,215 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రికార్డ్ స్ధాయిలో కేసులు నమోదు అవడంతో అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేయడానికి ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం.
చైనాలో శుక్రవారం నాడు 4,790, శనివారం 5,600 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా చైనాలో వాణిజ్య రాజధాని అయిన షాంఘైలో అధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. ఆదివారం సైతం ఇదే తరహాలో కేసులు మళ్ళీ పెరగటంతో ఎలాగయినా కరోనాను కట్టడి చేయాలని నిర్ణయించుకుంది. జీరో కోవిడ్ స్ట్రాటజీని అవలంబిస్తున్న డ్రాగన్ దేశం ఎక్కడికక్కడ ఆంక్షలు విధించడానికి సిద్ధమైపోయింది. ప్రాంతాల వారీగా లాక్ డౌన్ అమలు చేస్తూ ప్రజలు ఇల్ల నుండి బయటకు రాకూడదని ఆంక్షలు విధిస్తున్నారు. ఇది ప్రస్తుతానికి అయిదు రోజుల పాటు కొనసాగనుంది.
అయిదు రోజుల పాటు షాంఘైలో లాక్ డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. అయితే ఈ లాక్ డౌన్ ఇప్పటివరకు కొనసాగనుంది అనేది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం ఉన్న కేసులు పూర్తిగా తగ్గే వరకు కొనసాగవచ్చని తెలుస్తోంది. ఇక పలు దేశాలలో కరోనా కొత్త వేరియంట్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది మెల్ల మెల్లగా భారత్ కు సోకక ముందే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: